మెనోపాజ్‌లో ఎముకలు జాగ్రత్త!
స్త్రీల్లో పునరుత్పత్తి ఆగిపోయిందనడానికి మెనోపాజ్ ఒక సంకేతం. నెలసరి ఆగిపోతుంది. ఇది ప్రారంభమవడానికి కొన్ని నెలల ముందు నుంచే మహిళల శరీరంలో మార్పులు వస్తుంటాయి. హార్మోన్ల విడుదల ఆగిపోవడం, ఈస్ట్రోజన్ స్థాయి తగ్గడం, క్యాల్షియం, డి విటమిన్ లోపాలు ఎముకల్ని బలహీనంగా మారుస్తాయి.
స్త్రీల్లో పునరుత్పత్తి ఆగిపోయిందనడానికి మెనోపాజ్ ఒక సంకేతం. నెలసరి ఆగిపోతుంది. ఇది ప్రారంభమవడానికి కొన్ని నెలల ముందు నుంచే మహిళల శరీరంలో మార్పులు వస్తుంటాయి. హార్మోన్ల విడుదల ఆగిపోవడం, ఈస్ట్రోజన్ స్థాయి తగ్గడం, క్యాల్షియం, డి విటమిన్ లోపాలు ఎముకల్ని బలహీనంగా మారుస్తాయి. అందుకే మెనోపాజ్ దగ్గరపడ్డాక ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
క్యాల్షియం... ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆర్థరైటిస్ వంటి సమస్యలు దరిచేరనివ్వకూడదన్నా మహిళలు క్యాల్షియం లోపం లేకుండా చూసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మెనోపాజ్ దశలో స్త్రీలు తమ రోజువారీ ఆహారంలో సుమారు 1200 మిల్లీగ్రాముల క్యాల్షియంను అదనంగా తీసుకోవాలి. అలానే, పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే డైట్‌ని తీసుకోవాలి.
విటమిన్ డి... శరీరం క్యాల్షియంను గ్రహించుకోవడానికి తగినంత విటమిన్ డి కావాలి. గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు, ఓట్స్ వంటివి తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. వీటితోపాటు రోజూ ఉదయం, సాయత్రం వేళల్లో శరీరానికి ఎండ తగిలేలా చూసుకుంటే సరి.
వ్యాయామం... జాగింగ్, నడక, చిన్న చిన్న బరువులు ఎత్తే వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
తగినంత నిద్ర... ఈ సమయంలో తగినంత నిద్ర చాలా అవసరం. రోజుకి కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ప్రశాంత నిద్ర.. రుతువిరతి సమయంలో ఎముకలు సాంద్రత కోల్పోకుండా చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.