బొప్పాయి ఆకుతో ఆరోగ్యం

బొప్పాయిలోనే కాదు దాని ఆకుల్లోనూ అనేక ఔషధగుణాలు ఉన్నాయి. నెలసరి నొప్పులు, చర్మ సంబంధిత వ్యాధులు, వాపుల నుంచి రక్షిస్తుందని నిపుణులంటున్నారు..

Published : 20 Aug 2023 00:04 IST

బొప్పాయిలోనే కాదు దాని ఆకుల్లోనూ అనేక ఔషధగుణాలు ఉన్నాయి. నెలసరి నొప్పులు, చర్మ సంబంధిత వ్యాధులు, వాపుల నుంచి రక్షిస్తుందని నిపుణులంటున్నారు..

  • నెలసరిలో బొప్పాయి ఆకులతో చేసిన టీ, డీకాక్షన్‌ను తాగితే కడుపు నొప్పి, జీర్ణం కాకపోవడం, వికారం, తలనొప్పి లాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.
  • ఈ ఆకుల్లో సైటోటాక్సిక్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కణాలను నిర్మూలించడంలో సాయపడుతుంది. దీని రసాన్ని తాగితే చర్మ సంబంధిత క్యాన్సర్లు దరిచేరవు.
  • దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ ఇ కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. హెపటైటిస్‌, హెచ్‌సీవీ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి. .
  • మహిళల్లో వస్తోన్న మానసిక సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలకు విటమిన్‌ సి లోపమే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. బొప్పాయి ఆకుల్లో ఉండే విటమిన్‌ సి భావోద్వేగాలన్నింటినీ నియంత్రించి ఉపశమనం కలిగిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని