ప్రయాణాల్లో కళ్లు జాగ్రత్త!

ఆహ్లాదం కోసమో, అవసరం కోసమో కొన్ని సార్లు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఆరోగ్యంతో పాటు కళ్లను కాపాడుకోవడం చాలా ముఖ్యం..

Published : 23 Aug 2023 01:59 IST

ఆహ్లాదం కోసమో, అవసరం కోసమో కొన్ని సార్లు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఆరోగ్యంతో పాటు కళ్లను కాపాడుకోవడం చాలా ముఖ్యం..

  • నేరుగా తాకే సూర్య కిరణాలు కంటికి హాని చేయకుండా ఉండేందుకు సన్‌ గ్లాసెస్‌ వాడటం తప్పనిసరి.
  • ప్రయాణంలో గాలికి కళ్లు పొడిబారి ఎర్రగా మారతాయి. ఈ ఇబ్బంది తలెత్తకుండా ఉండటానికి వైద్యుల సలహా మేరకు ఐ డ్రాప్స్‌ వాడాలి. తరచూ శుభ్రమైన చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కుంటూ ఉండాలి. అలానే శరీరం డీహైడ్రేట్‌ కాకుండా తగినన్ని నీళ్లు తాగడమూ తప్పనిసరి. అప్పుడే కళ్లు పొడిబారకుండా తేమగా ఉంటాయి.
  • ఈ సమయంలో కళ్లకు వేసుకునే మేకప్‌ మితంగా ఉంటేనే మంచిది. లేదంటే ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలానే దూర ప్రయాణాలు చేసేప్పుడు కాంటాక్ట్‌ లెన్సులు వాడకపోవడమే మేలు.
  • కొందరు ప్రయాణాల్లో తరచూ ఆగి టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేట్‌ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రభావమూ కళ్లపై పడుతుంది. బదులుగా ఏదైనా పండుని తినండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని