పోషకాల నైవేద్యాలు..
పూజలంటే.. ప్రసాదాలూ తప్పనిసరే. నేడు క్షీరాన్నం, పులిహోర, కుడుములు, గారెలు.. వంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం. వీటిలో రుచే కాదు ఇంటిల్లిపాదికీ మేలు చేసే పోషకాల గని దాగుందని తెలుసా? లక్ష్మీదేవికి ఇది ప్రీతిపాత్రమైనది. ఆవుపాలల్లో ఎ, డి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే క్యాల్షియం ఎముకలనీ, కండరాలనీ దృఢంగా చేస్తుంది.
పూజలంటే.. ప్రసాదాలూ తప్పనిసరే. నేడు క్షీరాన్నం, పులిహోర, కుడుములు, గారెలు.. వంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం. వీటిలో రుచే కాదు ఇంటిల్లిపాదికీ మేలు చేసే పోషకాల గని దాగుందని తెలుసా?
క్షీరాన్నం.. లక్ష్మీదేవికి ఇది ప్రీతిపాత్రమైనది. ఆవుపాలల్లో ఎ, డి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే క్యాల్షియం ఎముకలనీ, కండరాలనీ దృఢంగా చేస్తుంది. బెల్లంలోని ఐరన్, ఫోలేట్‌లు రక్తాన్ని శుద్ధి చేయడమే కాదు, ఎర్రరక్త కణాల వృద్ధికీ తోడ్పడతాయి. ఇతర పోషకాలు ఎండార్ఫిన్లను విడుదల చేసి మానసిక ఉల్లాసాన్నిస్తాయి. దగ్గు జలుబు వంటి సీజనల్ వ్యాధులకీ చెక్ పెడతాయి.
మినప గారెలు.. మినపప్పులో కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పీచు జీర్ణక్రియను మెరుగు పరచడమే కాదు.. ఇతర పదార్థాల నుంచి పోషకాలను గ్రహించేలానూ చేస్తుంది. తద్వారా అనారోగ్యాల్నీ దూరంగా ఉంచుతుంది.
శనగలు.. ముత్తయిదువుకి వాయనంగా, అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తాం. శరీరానికి తోడ్పడే ప్రొటీన్లు, పీచుపదార్థాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. కొవ్వును తగ్గించి, బరువుని నియంత్రణలో ఉంచడానికి సాయపడతాయి. పీచు రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతుంది.
కుడుములు.. ఆవిరి మీద ఉడికించే వీటిలో ఉపయోగించే కొబ్బరి, శనగపప్పు అన్నీ పోషకాలమయమే! కొబ్బరిలోని విటమిన్ ఎ, బి, సి, థయమిన్‌లు అవయవాలను చురుగ్గా పని చేసేలా చేస్తాయి. మెదడు సంబంధిత వ్యాధులని, అల్జీమర్స్‌ని దరి చేరనీయవు.
పులిహోర.. చింతపండు గుజ్జు, పసుపు, ఇంగువ వేసి పోపు వేస్తాం. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ని తొలగిస్తాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. ఇంగువ లేనిదే రుచే లేదు. దీనిలోని క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ బి జీర్ణప్రక్రియను మెరుగు పరుస్తాయి. పోపుదినుసుల నుంచి శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు లభిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.