కాళ్లూ, చేతులూ తిమ్మిర్లెక్కుతున్నాయా?
చాలామందిలో కాళ్లూ, చేతులూ తిమ్మిర్లు పడుతుంటాయి. మీరూ అదే సమస్యని ఎదుర్కొంటున్నారా? దీనికి వజ్రాసనం మంచి పరిష్కారం..
చాలామందిలో కాళ్లూ, చేతులూ తిమ్మిర్లు పడుతుంటాయి. మీరూ అదే సమస్యని ఎదుర్కొంటున్నారా? దీనికి వజ్రాసనం మంచి పరిష్కారం..
రక్తప్రసరణ సరిగా జరగనప్పుడు ఇలా కాళ్లూ, చేతులూ తిమ్మిర్లుపడుతుంటాయి. ఆయుర్వేదంలో దీనిని వాతదోషంగా పిలుస్తాం. పాదాలలో తిమ్మిర్లు, మంటలు కూడా వస్తుంటాయి. వీటికి విటమిన్ బి12 సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అలాగే మధుమేహం, స్పాండిలైటిస్ ఉన్నవారిలో రక్తప్రసరణ సరిగా జరగపోవడం వలన కూడా చేతులూ, కాళ్లూ తిమ్మిర్లు, మంటలు వస్తుంటాయి. ‘వజ్రాసనం’ దీనికి చక్కని ఉపశమన మంత్రం.
వజ్రాసనం
యోగా చాప లేదా నేల మీద రెండు కాళ్లనూ తిన్నగా చాచి కూర్చోవాలి. ఒకదాని తర్వాత మరొక కాలుని మోకాళ్ల దగ్గర వంచుతూ వెనక్కి తీసుకురావాలి. పాదాలను పిరుదుల కిందకి తీసుకు రావాలి. మడమలను ఎడంగా ఉంచాలి. అరచేతులను చిత్రంలో చూపిన విధంగా ఉంచాలి. శరీర బరువుని పిరుదుల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస కేంద్రీకరించాలి. అరనిమిషం పాటు ఉండి యాథాస్థితికి రావాలి. ఇలా మూడుసార్లు చేయాలి. మోకాళ్ల నొప్పులున్న వారు, ఆర్థరైటిస్ ఉన్న వారు ఈ ఆసనం వేయరాదు.
- శిరీష, యోగా గురు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.