పాలిస్తున్నారా.. ఇవి తినొద్దు
చంటిబిడ్డకు తల్లిపాలే పోషకాహారం. వారి శారీరక, మానసిక ఎదుగుదలలో వీటిది ప్రధాన పాత్ర. ఎన్నో రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడే రక్షణ కవచం. మరి ఈ ప్రయోజనాలన్నీ పాపాయికి అందాలంటే మనం కొన్నింటికి దూరంగా ఉండాలని తెలుసా?
చంటిబిడ్డకు తల్లిపాలే పోషకాహారం. వారి శారీరక, మానసిక ఎదుగుదలలో వీటిది ప్రధాన పాత్ర. ఎన్నో రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడే రక్షణ కవచం. మరి ఈ ప్రయోజనాలన్నీ పాపాయికి అందాలంటే మనం కొన్నింటికి దూరంగా ఉండాలని తెలుసా?
- కెఫీన్ ఉండే ఆహార పదార్థాలను రోజులో రెండు సార్లకు మించకుండా చూసుకోవాలి. అంతకు మించితే పిల్లల్లో జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు చంటి పిల్లలకు నిద్రలేమి, చికాకుని కలిగిస్తాయి.
- క్యాలీఫ్లవర్ క్యాబేజీ, దోసకాయ, బ్రకోలి వంటి కాయగూరలను వీలైనంత వరకు తగ్గించాలి. ఇవి గ్యాస్‌కు కారణమవుతాయి. అలానే దాల్చిన చెక్క, మిరియాలు వంటి మసాలా పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఇవి చిన్నారుల్లో అరుగుదల సమస్యలకు దారి తీస్తాయి. ముఖ్యంగా అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. శరీర ఉష్ణోగ్రతలు పెరిగి విరోచనాలు అయ్యే అవకాశాలున్నాయి.
- పాలిచ్చే తల్లులు పుదీనాను వీలైంత తక్కువ తీసుకోవడం మేలు. ఎందుకంటే ఇందులోని మెంథాల్ పాల ఉత్పత్తిని తగ్గిస్తుందని చెబుతున్నాయి పలు అధ్యయనాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.