వెనకకు నడవటం మంచిదే...
నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందని మన అందరికీ తెలుసు. వడివడిగా అడుగులేస్తూ ముందుకు వెళ్లడమే కాదు.. నెమ్మదిగా అయినా సరే, వెనక్కి నడవడం కూడా అలవాటు చేసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయంటున్నారు నిపుణులు.
నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందని మన అందరికీ తెలుసు. వడివడిగా అడుగులేస్తూ ముందుకు వెళ్లడమే కాదు.. నెమ్మదిగా అయినా సరే, వెనక్కి నడవడం కూడా అలవాటు చేసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయంటున్నారు నిపుణులు. మరి ఎలా నడవాలి? ఆ లాభాలేంటి.. తెలుసుకుందామా
- ముందుగా సురక్షిత ప్రదేశాన్ని ఎంచుకున్నాకే వెనక్కి నడవడం ఆరంభించండి. నెమ్మదిగా అడుగులేస్తూ క్రమంగా వేగాన్ని పెంచండి. ఈ నడక మీ శరీరానికీ, మనసుకీ మధ్య సమన్వయం పెంచుతుంది. విసుగు, కోపం వంటి వాటిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపడేలా చేస్తుంది.
- ఈ రకమైన నడక ఆస్టియో ఆర్థరైటిస్, జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి పలు రకాల ప్రయోజనాలిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. మోకాళ్లు, నడుము నొప్పి ఉన్నవారికి ఉపశమనాన్నిస్తుంది.
- ముందుకు వెళ్లడం కంటే వెనకకు నడవడం వల్ల శక్తి 40శాతం ఎక్కువగా ఖర్చవుతుంది. దీనివల్ల త్వరగా బరువు తగ్గగలరు.
- వేగంగా వెనకకు అడుగులు వేయటం వల్ల పాదాల వద్ద కండరాలు బలోపేతమవుతాయి. ఈ నడకతో ఎక్కువ కెలొరీలు ఖర్చు అవుతాయి. దీంతో జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. జీవక్రియా రేటు మెరుగవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.