అలర్జీకి ఇంటి ఔషధాలు...
వర్షాకాలంలో.. క్రిములు, కీటకాలు, అపరిశుభ్రత కారణంగా వ్యాధులు, అలర్జీలు వంటివి వస్తుంటాయి. అవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేలోపే వాటిని ఇంటి చిట్కాలతో ఎలా నివారించాలో చూద్దాం.
Published : 09 Sep 2023 01:52 IST
వర్షాకాలంలో.. క్రిములు, కీటకాలు, అపరిశుభ్రత కారణంగా వ్యాధులు, అలర్జీలు వంటివి వస్తుంటాయి. అవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేలోపే వాటిని ఇంటి చిట్కాలతో ఎలా నివారించాలో చూద్దాం...
- పసుపు: దీనిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో సాయపడుతుంది. రోజూ గ్లాసు పాలల్లో చిటికెడు పసుపు కలిపి తాగితే అలర్జీలను అరికట్టవచ్చు.
- వేప: దురద ఎక్కువగా అనిపించినప్పుడు కొబ్బరి నూనెలో వేపనూనె కలిపి రాస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. వేపలో యాంటీమైక్రోబియల్ లక్షణాలుంటాయి. ఇవి చర్మ అలర్జీలు నివారించటంలో బాగా ఉపయోగపడతాయి. వీటిని క్యాప్సూల్స్ లేదా పౌడర్ రూపంలో తీసుకోవచ్చు.
- అల్లం: శరీరానికి రోగనిరోధక శక్తిని అందించే యాంటీహిస్టమిన్‌లను కలిగి ఉంటుంది. ఇది అలర్జీ నుంచే కాదు, దగ్గు, తుమ్ములు వంటివాటి నుంచీ ఉపశమనం కలిగిస్తుంది.
- పుదీనా: ఇది శీతలీకరణ గుణాలు కలిగి ఉన్నందున దగ్గు, శ్వాస నాళాల్లో ఏదైనా సమస్య ఉన్న వెంటనే ఉపశమనాన్నిస్తుంది. పుదీనాను నీటిలో మరిగించి తీసుకోవడం వల్ల అలర్జీను దూరం చేయొచ్చు. మింట్ ఆయిల్‌ను పైపూతలా రాసినా మంచిదే!
- తులసి: అలర్జీ అనిపించినప్పుడు కొన్ని తులసి ఆకులను నమిలితే మంచిది. తులసి ఒత్తిడిని తగ్గించటంలోనూ, రోగనిరోధకశక్తిని పెంచటంలోనూ బాగా పనిచేస్తుంది.
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.