పీసీఓడీ ఉందా?

పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌.. ఇది అండాశయంలోని హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఏర్పడే సమస్య. ఇది వచ్చిన వారిలో ఊబకాయం, అవాంఛిత రోమాలు, జుట్టు రాలిపోవడం, గర్భధారణ, నెలసరి సమస్యలు తలెత్తుతాయి.

Updated : 09 Sep 2023 05:44 IST

పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌.. ఇది అండాశయంలోని హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఏర్పడే సమస్య. ఇది వచ్చిన వారిలో ఊబకాయం, అవాంఛిత రోమాలు, జుట్టు రాలిపోవడం, గర్భధారణ, నెలసరి సమస్యలు తలెత్తుతాయి. అలాగే పీసీఓడీ… ఉన్నవారిలో ఇన్సులిన్‌ హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. తద్వారా మధుమేహం వచ్చే అవకాశమూ ఉంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి ‘భద్రాసనం’ ప్రయత్నించి చూడండి..

ముందుగా కాళ్లను నిటారుగా చాపి కూర్చోవాలి. తర్వాత నెమ్మదిగా ఒక్కో కాలినీ మడిచి రెండు పాదాలతో నమస్కారంలా పెట్టాలి. భద్రాసనం వేసేప్పుడు నడుము, చేతులు నిటారుగా ఉండాలి.. ఫొటోలో చూపినట్టుగా. ఇలా ఉండగలిగినంత సేపు ఉండాలి. మరో పద్ధతి.. మడిచిన కాళ్లను పైకి కిందకి సీతాకోక చిలుక రెక్కలు ఆడించినట్టుగా రెండు కాళ్లనూ కదపాలి. దీనినే బటర్‌ఫ్లై ఆసనం అని కూడా అంటారు. ఈ ఆసనం వేసేప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచాలి. దీనిని రోజూ అర నిమిషం చొప్పున మూడుసార్లు వేయాలి. ఇలా చేయడం వల్ల హార్మోన్లలో అసమతుల్యతను నియంత్రించవచ్చు. పీసీఓడీని తగ్గించుకోవచ్చు. దీనితో పాటు ఆహార నియమాలు పాటించాలి. మొలకల్నీ..  అలాగే తగినంత విశ్రాంతి అవసరం.

ఇవీ ప్రయోజనాలు.. కటిభాగంలోని కండరాలు, కండర బంధనాలు వదులవుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సయాటికా, నెలసరి సమస్యకి మంచి మందు. గర్భాశయ సమస్యలు తగ్గుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది.

ఎవరు చేయకూడదు.. మోకాళ్ల నొప్పులు, కీళ్లనొప్పులు, మోకాళ్లకి గాయాలున్నవారు దీనిని చేయకూడదు.

- శిరీష, యోగాగురు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని