వృద్ధాప్యం రానివ్వని ఉల్లికాడలు

వంటకు రుచిని అందించే ఉల్లికాడలు ఆరోగ్యాన్నీ పరిరక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు సహా పలు పోషకాలు మెండుగా ఉండే వీటివల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.  రోజూ వంటల్లో ఈ కాడలను ఉపయోగించడం మంచిది. వీటిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి, సీజన్లలో వచ్చే అనారోగ్యాలను దరికి చేరనివ్వవు.

Published : 31 May 2024 02:27 IST

వంటకు రుచిని అందించే ఉల్లికాడలు ఆరోగ్యాన్నీ పరిరక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు సహా పలు పోషకాలు మెండుగా ఉండే వీటివల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.  

  • రోజూ వంటల్లో ఈ కాడలను ఉపయోగించడం మంచిది. వీటిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి, సీజన్లలో వచ్చే అనారోగ్యాలను దరికి చేరనివ్వవు. అలాగే వీటిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్‌ లక్షణాలు ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా పరిరక్షిస్తాయి. దగ్గు, జ్వరం ఉన్నప్పుడు ఈ కాడలతో చేసే సూప్‌ ఉపశమనాన్ని అందిస్తుంది.   
  • మెనోపాజ్‌ తర్వాత కాల్షియం లోపించడంతో ఎముకలు బలహీనపడతాయి. ఈ సమస్యను అధిగమించాలంటే తరచూ ఉల్లికాడలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వీటిలోని కాల్షియం, కె విటమిన్‌ ఎముకలను బలంగా ఉంచుతాయి. అలాగే వీటిలోని సి విటమిన్‌ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించి హృద్రోగాలను  దరి చేరనివ్వదు.
  • ఉల్లికాడల్లోని పీచు జీర్ణశక్తిని మెరుగ్గా ఉంచుతుంది. దీనివల్ల మలబద్ధక సమస్య ఉండదు. అధికబరువుకు దూరంగా ఉండొచ్చు. అలాగే వీటిలోని ఏ, సి, కె విటమిన్లు, కెరోటినాయిడ్స్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. 
  • వీటిలోని బయోఫ్లావనాయిడ్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్స్‌ ప్యాంక్రియాటిక్, పేగు కాన్సర్‌ వంటివి దరి చేరకుండా చేస్తాయి. అధిక ఈస్ట్రోజన్‌ను తొలగించే సామర్థ్యం ఉల్లికాడల్లో ఉంటుంది. ఇవి రొమ్ము కాన్సర్‌ను నిరోధిస్తాయి.     
  • ఈ కాడల్లోని యాంటీఆక్సిడెంట్స్, పొటాషియం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోని అమినోయాసిడ్స్‌ చర్మకణాల ఉత్పత్తికి దోహదపడతాయి. సాగే గుణాన్ని, తేమని అందిస్తాయి. చర్మాన్ని పొడిబారకుండా ఉంచడంతో వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరవు.
  • వీటిలోని మెగ్నీషియం కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉల్లికాడల సూప్‌ తీసుకుంటే కండరాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని పొందొచ్చు. అలాగే  ఉల్లికాడల్లో పుష్కలంగా ఉండే సల్ఫర్‌ సమ్మేళనాలు మన శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. దీనివల్ల మధుమేహ సమస్యకు దూరంగా ఉండొచ్చు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్