శాకాహారులకు ప్రొటీన్‌ తగ్గుతుందా..!

మన శరీరం అనేక రకాల విధులను నిర్వర్తించడానికి ప్రొటీన్‌ చాలా అవసరం. ఇది కండరాలు, అవయవాలు, ఎంజైమ్‌లు, హార్మోన్లు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. అనేక కారణాల వల్ల శరీరానికి కావల్సిన మొత్తంలో ప్రొటీన్‌ లభించడం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. భారతీయ మార్కెట్‌ రిసెర్చ్‌ బ్యూరో నివేదిక ప్రకారం మహిళలకి రోజుకి 46 గ్రాముల ప్రొటీన్‌ అవసరం. అయితే శాకాహారుల్లో ఈ లోపం ఎక్కువగా గుర్తించారు.

Published : 04 Jun 2024 01:05 IST

మన శరీరం అనేక రకాల విధులను నిర్వర్తించడానికి ప్రొటీన్‌ చాలా అవసరం. ఇది కండరాలు, అవయవాలు, ఎంజైమ్‌లు, హార్మోన్లు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. అనేక కారణాల వల్ల శరీరానికి కావల్సిన మొత్తంలో ప్రొటీన్‌ లభించడం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. భారతీయ మార్కెట్‌ రిసెర్చ్‌ బ్యూరో నివేదిక ప్రకారం మహిళలకి రోజుకి 46 గ్రాముల ప్రొటీన్‌ అవసరం. అయితే శాకాహారుల్లో ఈ లోపం ఎక్కువగా గుర్తించారు. లోపాన్ని అధిగమించాలంటే..

  • సాధారణంగా ప్రొటీన్‌ గుడ్డు, చేప, మాంసం ద్వారా లభిస్తుంది. వీటిల్లో కాల్షియం, విటమిన్‌-డి, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉండి శరీరంలో పల్చని కండరాలను వృద్ధి చేస్తాయి. రోజూ గ్లాసు ఆవుపాలు తాగడంవల్ల 8గ్రా. ప్రొటీన్‌ అందుతుంది. దీంతోపాటు పెరుగు, పనీర్‌ తీసుకున్నా కూడా ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. శాకాహారులు తమ ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే సరి.
  • బాదం, జీడిపప్పు, వేరుశనగ వంటివి ఉప్పు లేకుండా చిరుతిండిగా తీసుకుంటే మేలు. లేదా ఓట్‌మీల్‌లో చియాగింజలను కలిపి తీసుకున్నా మంచిదే. వీటితోపాటు బచ్చలికూర, పచ్చిబఠాణీ, చిక్కుళ్లు, మొలకల్లోనూ ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్