ఆ అపోహ వద్దు..!

అందానికి ప్రాధాన్యం ఇచ్చేవారిలో అమ్మాయిలే ముందుంటారు కదా! దానికోసం చేయని డైటింగులు, శారీరక వ్యాయామాలుండవు. అంతేకాదు, వారు బరువు పెరగకుండా ఉండేందుకు ఆహారాన్ని చాలావరకు పరిమితం చేసుకుంటారు.

Updated : 13 Jun 2024 14:15 IST

అందానికి ప్రాధాన్యం ఇచ్చేవారిలో అమ్మాయిలే ముందుంటారు కదా! దానికోసం చేయని డైటింగులు, శారీరక వ్యాయామాలుండవు. అంతేకాదు, వారు బరువు పెరగకుండా ఉండేందుకు ఆహారాన్ని చాలావరకు పరిమితం చేసుకుంటారు. ఎంత బరువు తగ్గినా ఇంకా పెరిగిపోతున్నామనే భయం వీరిని వెంటాడుతుందట. దీనివల్ల తరవాత వారికి తినాలని ఆసక్తి కొద్దీ తిన్నా పొట్ట కుంచించుకుపోయి, ఆహారం కాస్త ఎక్కువైనా వాంతులు అవుతుంటాయి. నెమ్మదిగా ఇదే వ్యాధిలా కూడా మారుతుంది. దీనినే ‘అనోరెక్సియా’ అంటారు. ఈ లక్షణం ఉన్నవారు ఎంత బరువు తగ్గినా ఇంకా పెరిగిపోతున్నామనే భయం వీరిని వెంటాడుతుందట. అయితే ఈ లక్షణాలు, టీనేజీ అమ్మాయిల్లోనూ, ముప్ఫైౖల్లోపు స్త్రీలలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల పోషకాహారలోపానికి గురవ్వడమే కాకుండా, మెదడు, గుండె, మూత్రపిండాలతో సహా శరీరంలో ప్రతి అవయవం దెబ్బతినే ప్రమాదం ఉందట. దీనిని అదుపు చేయాలంటే మాత్రం వైద్యుల్ని సంప్రదించి ఆహార నియమాల్లో మార్పులు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. కాబట్టి అమ్మాయిలు ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎన్ని జాగ్రత్తలు అయినా పాటించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్