శరీరాన్ని చల్లబరిచే శీతలి

శీతలి ప్రాణాయామం చేయడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. దీంతోపాటు ఒత్తిడి అదుపులో ఉంటుంది. ఆందోళన, భయం వంటి మానసిక రుగ్మతలూ నయమవుతాయి. ఈ ఆసనం ఎలాంటి కష్టం లేకుండా కూర్చుని చేయొచ్చు.

Published : 15 Jun 2024 01:41 IST

శీతలి ప్రాణాయామం చేయడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. దీంతోపాటు ఒత్తిడి అదుపులో ఉంటుంది. ఆందోళన, భయం వంటి మానసిక రుగ్మతలూ నయమవుతాయి.

ఈ ఆసనం ఎలాంటి కష్టం లేకుండా కూర్చుని చేయొచ్చు. ముందుగా నేలపై వజ్రాసనంలో కూర్చోవాలి. కళ్లు మూసుకుని మూడుసార్లు దీర్ఘశ్వాస తీసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా నాలుకను ఫొటోలో చూపిన విధంగా లోపలి వైపునకు మడిచి ట్యూబ్‌లా రోల్‌ చేయాలి. బొటన, చూపుడు వేళ్లను కలిపి జ్ఞానముద్రలో ఉంచాలి. నాలుకను సున్నాలా మడిచి, దాంతో గాలి లోనికి తీసుకోవాలి. ఆపై నోటిని మూసి, తీసుకున్న గాలిని ముక్కు ద్వారా బయటకి వదలాలి. ఇలా రోజుకి పదిహేను సార్లు చేయాలి. దీనివల్ల రక్తపోటు, శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉండటంతోపాటు చర్మం హైడ్రేట్‌ అవుతుంది. ఈ ప్రాణాయామం వల్ల ఒత్తిడి, భయం, ఆందోళనలు తగ్గుతాయి. ఇది చేస్తూ కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. సబ్జా నీళ్లు, మజ్జిగ, పుచ్చకాయ, కర్భూజా రసాలను తీసుకోవాలి. జలుబు, ఆస్తమా, దగ్గు ఉన్నవాళ్లు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి.

శిరీష, యోగ గురు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్