ఆర్థరైటిస్‌... ఉపశమనమిలా

మహిళలను వేధించే సమస్యల్లో ఆర్థరైటిస్‌ ఒకటి. ఆటోఇమ్యూన్‌ కండిషన్‌ కారణంగా ఏర్పడే ఈ వ్యాధి వల్ల జాయింట్లు, ఎముకల్లో వాపులు సహా పలు సమస్యలు తలెత్తుతాయి. వాతావరణ మార్పుల కారణంగా ముఖ్యంగా చల్లగా ఉన్నప్పుడు ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాంటప్పుడు ఎలాంటి జీవనశైలి అనుసరించాలో నిపుణులు ఇచ్చే సలహాలివే...

Published : 26 Jun 2024 00:51 IST

మహిళలను వేధించే సమస్యల్లో ఆర్థరైటిస్‌ ఒకటి. ఆటోఇమ్యూన్‌ కండిషన్‌ కారణంగా ఏర్పడే ఈ వ్యాధి వల్ల జాయింట్లు, ఎముకల్లో వాపులు సహా పలు సమస్యలు తలెత్తుతాయి. వాతావరణ మార్పుల కారణంగా ముఖ్యంగా చల్లగా ఉన్నప్పుడు ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాంటప్పుడు ఎలాంటి జీవనశైలి అనుసరించాలో నిపుణులు ఇచ్చే సలహాలివే...

ఆహారంతో...

బ్రొకలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, లెట్యూస్, పాలకూర, క్యారెట్, గుమ్మడికాయ వంటి రంగురంగుల కూరగాయల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. చెర్రీ, బెర్రీ, ఆరెంజ్, ద్రాక్ష, దానిమ్మ లాంటి పళ్లూ తినాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి శరీరంలోని పీహెచ్‌ స్థాయుల్ని సమతుల్యం చేస్తాయి. దాంతోపాటు అవిసెగింజలు, చేపలు... వంటివాటిని ఆహారంలో భాగం చేసుకుంటే- వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌నీ, నొప్పినీ తగ్గిస్తాయి. 

రాగి చెంబుతో...

రాత్రంతా ఈ చెంబులో ఉంచిన నీటిని రోజుకొక గ్లాసు తాగాలి. దాన్లోని కాపర్‌ ఎముకలని దృఢపరుస్తుంది. దాంతోపాటు పాదాలను ఎప్సమ్‌ సాల్ట్‌ వేసిన నీళ్లలో కాసేపు ఉంచండి. అదేవిధంగా ఈ సాల్ట్‌ను నీళ్లలో వేసుకుని స్నానం చేయండి. దానిలోని మెగ్నీషియంను చర్మం పీల్చుకోవడంతో నొప్పులు తగ్గుతాయి. దానివల్ల నరాల పనితీరూ మెరుగుపడుతుంది. 

మంచినిద్రతో..

సరైన నిద్ర ఎంతో అవసరం. నిద్రపోయే సమయంలో శరీరం పునరుత్తేజితం అవుతుంది. బరువూ తగ్గుతాం. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరం కణాల ఉత్పత్తికి సంబంధించిన హార్మోన్లను విడుదలచేస్తుంది. అవి దెబ్బతిన్న కణజాలాన్ని బాగుచేసి, ఇన్‌ఫ్లమేషన్‌నూ తగ్గిస్తాయి. దాంతోపాటు శరీరానికి కదలికా అవసరం. చిన్న చిన్న వ్యాయామాలు, స్ట్రెచెస్‌ వల్ల జాయింట్ల చుట్టూ ఉండే కండరాలు గట్టిపడతాయి. అలానే, గోరువెచ్చని నువ్వుల నూనెను రాత్రి నిద్రపోయే ముందు నొప్పి ఉన్న భాగాల్లో మర్దన చేయండి. దానివల్ల రక్తప్రసరణ మెరుగుపడి, బిగుసుకున్న కండరాలు వదులవుతాయి. వీటన్నింటితోపాటు వాపు, నొప్పులను కలిగించే ఆహారాన్నీ, ఆయా పనుల్నీ గమనించుకుని వాటికి దూరంగా ఉంటే ఈ లక్షణాల నుంచి ఉపశమనం పొందొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్