దిగులుగా ఉంటే... త్రికోణాసనం!

ఎప్పుడు చూడు ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు కొందరు. చలాకీదనం ఉండదు. మానసిక సమస్యలు లేదా ఒత్తిడి కూడా ఇందుకు కారణం అయ్యుండొచ్చు. పరిష్కారంగా ఈ త్రికోణాసనాన్ని ప్రయత్నించి చూడండి...

Published : 06 Jul 2024 02:03 IST

ఎప్పుడు చూడు ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు కొందరు. చలాకీదనం ఉండదు. మానసిక సమస్యలు లేదా ఒత్తిడి కూడా ఇందుకు కారణం అయ్యుండొచ్చు. పరిష్కారంగా ఈ త్రికోణాసనాన్ని ప్రయత్నించి చూడండి...

కాళ్లను దూరంగా ఉంచి, సౌకర్యవంతంగా నిల్చోవాలి. కుడిపాదాన్ని 90 డిగ్రీల కోణంలో తిప్పి ఉంచాలి. శరీర బరువు రెండు పాదాలపైనా సమానంగా పడేలా చూసుకోవాలి. దీర్ఘశ్వాస తీసుకుంటూ కుడివైపు తుంటి నుంచి కిందకు వంగి చేత్తో పాదాన్ని తాకించాలి. అందితే నేలనే తాకొచ్చు. ఎడమ చేతిని పైకిలేపి గాల్లో ఉంచాలి. చూసేవాళ్లకి కుడిచేయి, ఎడమచేయి కలిపి సరళరేఖలా అనిపించాలి. తలని ఎడమ చేతి వైపు తిప్పి.. చేతి వేళ్లను గమనిస్తూ ఉండాలి. దీర్ఘ శ్వాస తీసుకుని సాధారణ స్థితికి రావాలి. ఇప్పుడు ఎడమ వైపు కూడా ఇదే విధంగా చేయాలి. మెడనొప్పి ఉన్నా, సర్జరీ అయినా, బీపీ ఉన్నా చేయకపోవడం మేలు.

ప్రయోజనాలు: శరీరం మొత్తానికి రక్త ప్రసరణ బాగా జరిగి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. చేతులు, భుజాలు, వెన్ను కండరాలు బలోపేతం అవుతాయి. మానసిక రుగ్మతలుంటే తగ్గుముఖం పడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్