జంతువుల్లా... చేయాలా?

‘యానిమల్‌ వాక్‌’... సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోన్న ఎక్సర్‌సైజ్‌ ట్రెండ్‌ ఇది. బాతు, కోతి, గొరిల్లా, బల్లి, కప్ప, పీత... చాలా జంతువుల నడకను అనుసరించడమే దీనిలో ప్రత్యేకత.

Published : 07 Jul 2024 02:12 IST

‘యానిమల్‌ వాక్‌’... సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోన్న ఎక్సర్‌సైజ్‌ ట్రెండ్‌ ఇది. బాతు, కోతి, గొరిల్లా, బల్లి, కప్ప, పీత... చాలా జంతువుల నడకను అనుసరించడమే దీనిలో ప్రత్యేకత. మరి ఇది నిజంగా మేలు చేసేనా? నిపుణులేం అంటున్నారు?

ఫుల్‌ బాడీ వర్కవుట్‌ అంటాం కదా! ఆ మాట ఈ ‘యానిమల్‌ వాక్‌’కి సరిగా నప్పుతుంది. ఎంచుకున్న జంతువేదైనా శరీరాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఫలితంగా శరీర భాగాలన్నింటిపై ప్రభావం పడి, అవి దృఢంగా మారతాయి.

  • ‘సమయం లేదు’, ‘బయటికి వెళ్లి చేయడానికి ఇబ్బంది’... వ్యాయామం అనగానే ఇలా చాలా కారణాలే చెబుతుంటాం కదా! వీటిని ప్రయత్నించండి. ‘ఏముంది... చిన్న పిల్లల్లా పాకడమేగా?’ అని తేలిగ్గా చెప్పినా... రంగంలోకి దిగినప్పుడు కానీ తెలియదు. అదెంత ముచ్చెమటలు పోయించగలదో! కప్పల్లా గెంతేటప్పుడు పూసే నవ్వులు ఉంటాయి చూడండీ... ఒత్తిడిని దూరం చేసి, మనసునీ తేలిక పరుస్తాయి. ఇక పిల్లలతోనూ ప్రయత్నించారంటే... వ్యాయామానికి వ్యాయామం, వారితో సరదాగా సమయం గడిపినట్టూ అవుతుంది.
  • రోజువారీ వ్యాయామంలో ‘కార్డియాక్‌ ఎక్సర్‌సైజ్‌లకు చోటివ్వాలి’ అంటారు కదా! యానిమల్‌ వాక్‌లు ఆ ప్రయోజనాలను చక్కగా అందిస్తాయి. రోజుకు కొన్ని జంతువుల నడకలను కలిపి 30 నిమిషాలు చేయాలంతే! శరీరాన్నీ ఫ్లెక్సిబుల్‌గా మారుస్తాయి. అంతేకాదు, వీటిని చేయాలంటే శరీరం, మెదడు సమన్వయం తప్పనిసరి. దీంతో ఏకాగ్రత పెరిగి, మతిమరపుకీ చెక్‌ చెప్పొచ్చట.
  • కాస్త స్థలంలో... ఎక్కడైనా ఎప్పుడైనా వీటిని చేసుకోవచ్చు. ప్రత్యేక పరికరాలేమీ అవసరం ఉండదు. సమయం, చేయాలన్న ఉత్సాహం ఉంటే చాలు... చక్కగా చేసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే, వీటికి ఆదరణ పెరుగుతోంది. సాకులు చెప్పక మీరూ ఓసారి ప్రయత్నించండి మరి! 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్