అనుబంధానికి మాటే మంత్రం!

భార్యాభర్తల మధ్య తగాదాలు, అలకలు సహజమే అయినా... వాటిని సర్దుబాటు చేసుకోవాలన్నా, సంసారం సంతోషంగా సాగిపోవాలన్నా మాటే కీలకం.

Published : 17 Jun 2021 01:47 IST

భార్యాభర్తల మధ్య తగాదాలు, అలకలు సహజమే అయినా... వాటిని సర్దుబాటు చేసుకోవాలన్నా, సంసారం సంతోషంగా సాగిపోవాలన్నా మాటే కీలకం. ఏ విషయమైనా సుతిమెత్తగా చెప్పగలిగితేనే సంతోషం మీ సొంతమవుతుంది.
ఎంత సేపూ గొడవలేనా! భాగస్వామిలో నచ్చే విషయం కనిపించినప్పుడు వెంటనే చెప్పండి. అప్పటివరకూ పడ్డ శ్రమ అంతా మరిచిపోతారు. మరింత ఉత్సాహంగా తమ బాధ్యతల్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తారు.

* ప్రతి పనీ మీ సమక్షంలోనే జరగాలనీ, మీకు తెలిసే చేయాలనీ పట్టుపట్టొద్దు. ఎదుటివారిపై నమ్మకం ఉంచి అవకాశం ఇవ్వండి. నీ మీద నమ్మకం ఉంది...దాన్ని పోగొట్టుకోవద్దని నెమ్మదిగానే, స్పష్టంగా చెప్పండి. అది వారి కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేస్తుంది. అనుకున్న పనులు సమర్థంగా నిర్వహించగలుగుతారు కూడా. అప్పుడు మీ మధ్య ఏ విషయాల్లోనూ తగాదాలు రావు.

* సమస్య ఏదైనా ఒక్కసారి మాట వదిలేస్తే...తర్వాత తప్పు సరిదిద్దుకున్నా ఫలితం ఉండదు. వాదన వచ్చినప్పుడు వీలైనంతవరకూ మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. లేదా కాసేపాగి మాట్లాడకుందాం అని చెప్పండి. అప్పుడు కోపం తాలూకు ప్రభావం కాస్తైనా తగ్గి పరుష పదాలు జారకుండా ఉంటాయి. సున్నితంగానే మీ ఇబ్బందీ పరిష్కరించుకోగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్