Published : 18/08/2021 01:07 IST

కొత్త కోడలిగా... అత్తగారింట!

నవ వధువుగా అడుగుపెట్టిన అమ్మాయికి అత్తగారింటి పరిస్థితులు అలవాటు కావడానికి, ఆ కుటుంబ సభ్యులతో కలిసిపోవడానికి కాస్త సమయం పడుతుంది. ముఖ్యంగా అత్తమామలను అర్థం చేసుకోవడానికి కొంత టైమ్‌ కావాల్సిందే. మీరూ కొత్త కోడలా...అయితే ఈ చిట్కాలు మీకోసమే...

సానుకూల వైఖరి...  కొత్తకోడలిగా మీకెంత కొత్తగా ఉంటుందో.. అప్పుడే వచ్చిన అత్తగారి హోదా కూడా ఆమెకు సరి కొత్తగానే ఉంటుంది. కాబట్టి తనతో సానుకూలంగానే వ్యవహరించండి. వేరే వాళ్ల మాటలు విని ఆమెను విరోధిలా చూడొద్దు. ఆమె కూడా మీతో కలివిడిగా ఉండటానికే ప్రయత్నిస్తుంది.
సమానత్వం... మీ అమ్మ లానే ఆమెనూ ప్రేమగా చూడండి. తన పుట్టినరోజు/ పెళ్లి రోజు, మరేదో వేడుక సందర్భంగా బహుమతితో ఆమెను సర్‌ప్రైజ్‌ చేయండి. ఒకవేళ మీరు తనకి దూరంగా ఉంటున్నట్లయితే వారానికో, రెండు వారాలకో లేదా వీలున్నప్పుడల్లా కలిసి రండి. అప్పుడే బంధాలు బలపడతాయి.
గొడవలొద్దు... కొడుకు ఎంత పెద్దవాడైనా తల్లికి చిన్న వాడిలానే కనిపిస్తాడు. పెళ్లయిన కూడా ఆమెకు పసివాడే. అలాంటి మాతృమూర్తితో మీ భర్తకు సంబంధించి ఏ విషయంలో పోటీ, గొడవ వద్దు. చిన్నప్పటి నుంచి బిడ్డ బాగోగులు చూడటం, తనే ప్రపంచంగా పెంచుకున్న అత్తమ్మను అర్థం చేసుకుని మెలగాలి.
మర్యాద... అత్తగారిని గౌరవించండి. ఆమె వయసుకు, పెద్దరికానికి ఎదురు చెప్పొద్దు. ఆమె జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉండొచ్చు. కుటుంబం, పిల్లల పాలన... ఇలా ఆమె పడిన కష్టాలను తెలుసుకోండి. అత్తగారికి అపార జీవితానుభవం ఉంటుంది. కాబట్టి ముఖ్య విషయాల్లో ఆమె సలహాలు, సూచనలు తీసుకోండి. అవి నచ్చక పోయినా, వాటిని పాటించకపోయినా ఫరవాలేదు.  అయితే పెద్దావిడగా ఆమెకు గౌరవం మాత్రం తప్పకుండా ఇవ్వాల్సిందే. ఆమె చెప్పేది వినండి. మీకు నచ్చని విషయాలను సమయం, సందర్భం చూసుకుని, సానుకూలంగా సున్నితంగా చెప్పండి. ఆవిడా అర్థం చేసుకుంటారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని