విమర్శలకి భయపడకండి...

అమ్మాయిలు... చాలామంది నలుగురిలో మాట్లాడటానికీ, మనసులోని విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి వెనుకంజ వేస్తారు. ఎందుకంటే ఓటమి కన్నా విమర్శంటేనే ఎక్కువ భయం. దాన్నెలా అధిగమించాలి?

Published : 22 Sep 2021 01:24 IST

అమ్మాయిలు... చాలామంది నలుగురిలో మాట్లాడటానికీ, మనసులోని విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి వెనుకంజ వేస్తారు. ఎందుకంటే ఓటమి కన్నా విమర్శంటేనే ఎక్కువ భయం. దాన్నెలా అధిగమించాలి?

వరో ఏదో అంటారని, విమర్శిస్తారని ఏ పనీ చేయొద్దు. మహా అయితే కాసేపు చెప్పుకొంటారు. నవ్వుకుంటారు. ఇంతేగా! కానీ అందుకు భయపడి మిమ్మల్ని మీరు కోల్పోతే అంతకన్నా ఎక్కువే నష్టపోతారు అని గుర్తించండి.

* అంతా మీకు నచ్చినట్లే చెప్పాలని కోరుకోవడం, మీ పనిని అభినందించాలని భావించడం తప్పు. వచ్చే విమర్శల్ని కూడా స్వీకరించండి. లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. విజయాలూ, ఓటముల్ని మీ వ్యక్తిత్వం నుంచి వేరుగా చూడండి. వీటిలో పాతాళానికి పడిపోయినా సరే దాని ప్రభావం మీ వ్యక్తిత్వంపై పడకుండా చూడండి. ఇదో రకం స్థితప్రజ్ఞత. సాధన చేయండి. అప్పుడే ఎన్ని విమర్శలొచ్చినా వాటి మంచి చెడుల్ని తార్కికంగా ఆలోచించగలరు.

* ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తున్నారంటేనే.. మీరు వాళ్లు గుర్తించదగ్గ ఏదో ఒకపని చేస్తున్నారనే అర్థం. మీ కోసం వాళ్ల సమయాన్ని వెచ్చించి ఇంతగా విమర్శిస్తున్నారంటే మంచి విషయమే కదా! ఎవరూ గుర్తించని విధంగా గుంపులో ఒకరిగా మిగిలిపోయేలా మీ పనితీరు లేదు కదా అని సంతోషించండి. ఈ ఆలోచన ఉంటేనే విమర్శల్ని మీ ఎదుగుదలకు మెట్లుగా మలచుకోగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్