పిల్లల స్నేహం.. పెద్దలజోక్యం

ప్రాథమిక స్థాయిలో మీ చిన్నారి ఇతర పిల్లలతో కలివిడిగా ఉంటున్నదీ లేనిదీ గమనించాలి. స్నేహం ఎంత అవసరమో, తగిన మిత్రులను ఎంచుకుంటే ఎంత ఆనందమో చెప్పాలి.

Updated : 19 Nov 2021 05:15 IST

ప్రాథమిక స్థాయిలో మీ చిన్నారి ఇతర పిల్లలతో కలివిడిగా ఉంటున్నదీ లేనిదీ గమనించాలి. స్నేహం ఎంత అవసరమో, తగిన మిత్రులను ఎంచుకుంటే ఎంత ఆనందమో చెప్పాలి. అర్థం కాని విషయాలను విడమర్చి చెప్పాలి. అబద్ధాలు, దొంగతనాలు లాంటి అలవాట్లు ఎంత ప్రమాదమో చెప్పి అలాంటి నైజం ఉన్నవారితో సాన్నిహిత్యం కూడదని గ్రహించేలా చేయాలి.

* స్నేహం శక్తి, దాని ప్రభావం ఎంత తీవ్రమైనవో వివరించి మంచివారితో ఉంటే ఏం జరుగుతుందో, మోసకారులతో ఉంటే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పాలి. ఎంపిక తెలివిగా ఉండాలని, నిర్ణయం నీ చేతిలోనే ఉందని చెప్పండి. ఆ స్వేచ్ఛ వారికెంతో ఆనందాన్నిస్తుంది.

* చదువు, ఆటల్లో చురుగ్గా ఉంటూ నవ్వుతూ తుళ్లుతూ ఉండేవారిని అందరూ ఇష్టపడతారని తెలియజేస్తూనే, వెనకబడితే కారణమేంటో తెలుసుకుని భుజం తట్టి ప్రోత్సహించాలి. ఈ విషయంలో చిన్నారుల నేస్తాలతోనూ ముచ్చటించాలి.

* పిల్లల స్నేహితులతో మీరూ చొరవగా, ప్రేమగా ఉండండి. కానీ వాళ్లతో పోల్చి చురుగ్గా లేవనో లేదా తెలివిలేని వారితో సఖ్యతగా ఉంటే వెనకబడతావనో నిందించొద్దు. స్నేహానికి మనస్తత్వం కలవడం ముఖ్యం. అంతే తప్ప మూసపోసినట్టూ అన్ని లక్షణాలూ ఒకేలా ఉండవు.

* పిల్లలకు ‘నువ్విలా ఉండాలి, అలా ఉండాలి’ అంటూ నీతిసూత్రాలు చెబితే నచ్చదు. ప్రతి అంశాన్నీ కథల రూపంలో లేదా మహనీయుల ఉదాహరణల రూపంలో చెబితే తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు.

* స్నేహితులతో పేచీలూ పోట్లాటలూ తలెత్తితే మన పిల్లలు అనే పక్షపాత వైఖరి చూపకుండా ఎవరిది తప్పో, ఎలా సరిదిద్దుకోవాలో ఇద్దరి సమక్షంలో చెప్పండి. ఇది వాళ్ల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్