పెళ్లయితే వదిలెయ్యాలా?
close
Updated : 27/11/2021 06:08 IST

పెళ్లయితే వదిలెయ్యాలా?

అమ్మాయిలకు పెళ్లితో చాలా మార్పులొస్తాయి. ఆఖరికి చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగిన నేస్తాల్ని కూడా ఒక్కోసారి పక్కన పెట్టేయడం చూస్తుంటాం. భర్త, అత్తింటివారు ఎంత ముఖ్యులైనా ఆప్తమిత్రులూ అవసరమే. ఆ స్నేహం కొనసాగిస్తేనే జీవనం ఆహ్లాదంగా సాగుతుంది...

పెళ్లి కొత్త అధ్యాయమే. కానీ అందాకా ఉన్నదంతా చెరిపేసి రాసే కొత్త కథ కాదు! కనుక పెళ్లవ్వగానే బాల్య స్నేహాలను తుంచేయాల్సిన పనిలేదు. ఎందరు బంధువులున్నా నెచ్చెలి పాత్రను భర్తీ చేయలేరు.

* పెళ్లితో బాధ్యతలు పెరుగుతాయి, నిజమే. కానీ ఆ అలసటలన్నీ తీరేది ప్రాణసఖి సంభాషణతోనే. కనుక పనులన్నీ చక్కబెట్టుకుంటూనే నేస్తం కోసమూ సమయాన్ని కేటాయించండి.

* భర్త వచ్చాకా ప్రాణప్రదంగా చూసుకున్న నెచ్చెలిని మర్చిపోతే ఎంత నొచ్చుకుంటుందో ఆలోచించండి. రేపెప్పుడో మీకు ఒంటరితనంగా అనిపిస్తే ఆమె అక్కున చేర్చుకోగలదా?!

* ఆనందాలను నేస్తంతో చెప్పుకొంటే రెట్టింపవుతాయి. మెలిపెట్టే ఆందోళనలు ఆమెతో పంచుకుంటే గుండెభారం తీరినట్టు ఉంటుంది. ఆ స్నేహమే జీవితాన్ని పరిమళింపజేస్తుంది.

* మీకెంతో నచ్చిన నేస్తాల్ని భర్త, అత్తమామలకూ పరిచయం చేయండి. క్రమంగా వారూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోతారు. అప్పుడిక వారిని కోల్పోయే ప్రసక్తే ఉండదు


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని