ఈ అలవాట్లే దీర్ఘాయువునిస్తాయట!

ఆహారం, వ్యాయామం, జీవనశైలిపై మన జీవితకాలం ఆధారపడి ఉంటుందంటున్నారు అమెరికాకు చెందిన దీన్‌ ఆర్నిష్‌, అన్నే ఆర్నిష్‌ అనే పరిశోధక జంట. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తున్న వారిపై అధ్యయనం చేసి, ఆ వివరాలను ‘అన్‌ డు ఇట్‌ విత్‌ ఆర్నిష్‌’ పేరుతో ఈ జంట పుస్తకాన్ని విడుదల చేశారు.

Updated : 19 Dec 2021 05:10 IST

ఆహారం, వ్యాయామం, జీవనశైలిపై మన జీవితకాలం ఆధారపడి ఉంటుందంటున్నారు అమెరికాకు చెందిన దీన్‌ ఆర్నిష్‌, అన్నే ఆర్నిష్‌ అనే పరిశోధక జంట. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తున్న వారిపై అధ్యయనం చేసి, ఆ వివరాలను ‘అన్‌ డు ఇట్‌ విత్‌ ఆర్నిష్‌’ పేరుతో ఈ జంట పుస్తకాన్ని విడుదల చేశారు. అలాగే ఆహారానికి సంబంధించి చెడు అలవాట్ల ప్రభావం ఎలా ఉంటుందో కూడా పొందుపరిచారిందులో. ఆ అధ్యయనంలో వెల్లడైన మరిన్ని విషయాలు...

ఆహారాన్ని తీసుకునే విధానం, ఒత్తిడి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నం, శరీరాన్ని ఎంత వరకు కదిలిస్తాం, ఇతరులతో సత్ససంబంధాలను ఎలా కొనసాగిస్తాం అనే అంశాలపై మన జీవితకాలం ఆధారపడి ఉంటుంది. వీటిని సక్రమంగా నిర్వర్తిస్తే వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్‌ వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

* దీర్ఘాయువులు దాదాపు శాఖాహారులు కావడం విశేషం. ప్లేటులో 90 శాతానికి పైగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, బీన్స్‌కు ప్రాముఖ్యతనిచ్చిన వారిలో వృద్ధాప్యంలో కూడా సంపూర్ణ ఆరోగ్యం కనిపించింది. హృద్రోగం, టైప్‌ 2 డయాబెటిస్‌, క్యాన్సర్‌, అల్జీమర్‌ వంటి వ్యాధులకు దాదాపు వీరు దూరంగా ఉన్నారు. ఇటువంటి ఆహారపుటలవాట్లు ఉన్న వారిని బ్లూజోన్‌గా పరిగణించారు. ఈ జోన్‌లో ఉన్న వారు ఎక్కువగా నీటిని తీసుకోవడంతోపాటు అప్పుడప్పుడు కాఫీ తాగే అలవాటున్న వారు.
 

* తోటపని, మెడిటేషన్‌తో ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం వీరిలో ప్రధాన అలవాటు. నిద్రలేమి లేకుండా జాగ్రత్తపడటంతో శరీరం, మెదడు కూడా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వీరి దరిచేరలేదు. అలాగే రోజంతా శారీరకశ్రమ, ఉత్సాహంగా ఉండటం, రోజూ వర్కవుట్లు, నడక, నృత్యం వంటివన్నీ వీరిని ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండేలా చేశాయి. కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులు, ఇరుగుపొరుగుతో సత్ససంబంధాలను కొనసాగించే వారిలో అనారోగ్యాలు తక్కువగా కనిపించాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్