ఈ ఐదూ ఆచరించేయండి మరి!

విజయం దరి చేరాలంటే అది క్రమశిక్షణతోనే సాధ్యం. మీరు అనుసరించే అలవాట్లే ఇతరుల నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. అవేంటో చూసేయండి...

Updated : 11 Feb 2022 05:26 IST

విజయం దరి చేరాలంటే అది క్రమశిక్షణతోనే సాధ్యం. మీరు అనుసరించే అలవాట్లే ఇతరుల నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. అవేంటో చూసేయండి...

ప్రణాళిక... ఏ పని చేయాలన్నా పక్కా ప్రణాళిక ఉండాల్సిందే. ఇంటి పనైనా, ఆఫీస్‌ వర్క్‌ అయినా... ఏదైనా సరే... కాబట్టి రేపటికి సంబంధించిన ఇల్లు, ఆఫీస్‌ పనుల జాబితాను పడుకోబోయే ముందే తయారుచేసి పెట్టుకోండి.
చక్కటి నిద్ర కోసం.. పనులు చేసి అలసిన మనసు, తనువు సేద తీరాలంటే మంచం, దుప్పట్లు, దిండ్లు శుభ్రంగా, చక్కగా అమరి ఉండాలి. గజిబిజిగా, చిందరవందరగా ఉన్న పరుపుపై నిద్ర పట్టదు. ఎంత అలసిపోయినా బెడ్‌ను చక్కగా సర్దుకుంటే ఇది కంటినిండా కునుకు పట్టేలా చేస్తుంది. దాంతో మరింత ఉత్సాహంతో నిద్ర లేస్తారు.
త్వరగా నిద్రలేవడం... విజయకాంక్ష ఉన్న మహిళల డైరీలో ఆలస్యం అనే పదం ఉండదు. వారు సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తారు. ఇందుకోసం రాత్రుళ్లు త్వరగా నిద్రపోతారు.  కాబట్టి అన్ని పనులు అనుకున్నట్లు జరగాలన్నా... ఆరోగ్యంగా ఉండాలన్నా... త్వరగా నిద్రపోయి, త్వరగా నిద్రలేవాల్సిందే.
5 నిమిషాలు... ముందు రోజు రాత్రే రేపేం చేయాలో ప్రణాళిక వేసుకున్నా లేచిన వెంటనే  ఓసారి ఆ జాబితాను నిశితంగా పరిశీలించి వాటిని మెదడులో నిక్షిప్తం చేసుకోవాలి. అందుకోసం లేవగానే ఓ అయిదు నిమిషాలు కేటాయిస్తే సరి. అన్ని పనులతోపాటు మిగిలిన లేదా అదనపు సమయాన్ని కుటుంబం, స్నేహితులతో ఆనందంగా గడపడానికి కేటాయించుకోవాలి.
వ్యాయామం తప్పదు... జీవితంలో విజయం సాధించాలంటే... ముందుగా ఆరోగ్యంగా ఉండాల్సిందే. ఉదయం లేచిన వెంటనే మొదట కనీసం ఓ అరగంట వ్యాయామానికి కేటాయించాలి. దీని వల్ల రోజంతా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.  మీ మెదడు, శరీరం మీ మాట వినాలంటే దానికి రోజూ కచ్చితంగా కసరత్తులు కావాల్సిందే.
అప్పుడే జీవక్రియలు సాఫీగా జరుగుతాయి. మీ దృష్టి మీరు అనుకున్న పనిపై పెట్టగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్