పాప..పండ్లే తినదు!

పాపకు ఆరేళ్లు. పండ్లు, తీపి పదార్థాలేమీ తినదు. ప్రత్యామ్నాయంగా పోషకాలు అందించే వీలేమైనా ఉందా? బరువూ ఉండాల్సిన దానికన్నా తక్కువగానే ఉంది. ఏం చేయను?

Updated : 26 May 2022 12:59 IST

పాపకు ఆరేళ్లు. పండ్లు, తీపి పదార్థాలేమీ తినదు. ప్రత్యామ్నాయంగా పోషకాలు అందించే వీలేమైనా ఉందా? బరువూ ఉండాల్సిన దానికన్నా తక్కువగానే ఉంది. ఏం చేయను?

- ఓ సోదరి

తిన్నదేదైనా జీర్ణమయ్యాక రక్తంలో చక్కెరలుగానే మారతాయి. కాబట్టి, చక్కెర, తీపిపదార్థాలు తినడం లేదని కంగారుపడాల్సిన పనిలేదు. ఇక పండ్లు.. సాధారణంగా చిన్నపిల్లలు కొత్తవాళ్లని చూసి ఎలా భయపడతారో కొత్త ఆహారం విషయంలోనూ అంతే! అందుకే ఏడాది, ఏడాదిన్నరలోపే రకరకాల పండ్లని అలవాటు చేయాలని చెబుతాం. విటమిన్‌ సి, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి వీటి నుంచే అందుతాయి. కాబట్టి, తప్పక తీసుకోవాలి. తను తినట్లేదు కాబట్టి కూరగాయల సలాడ్లు, టమాటా, ఉడికించిన కూరలు ఎక్కువ మోతాదులో తినిపించడం, మొలకెత్తిన గింజలు ఇవ్వడం, ఉడకబెట్టిన శనగలు, పెసలు, అలసందలు వంటివి గుగ్గిళ్లుగా పెట్టడం చేయాలి. పండ్లు తీసుకోకపోవడం వల్ల నష్టపోయిన పోషకాలు వీటి ద్వారా భర్తీ అవుతాయి. తీపిని బలవంతంగా అలవాటు చేయాల్సిన అవసరం లేదు. వేళకి తింటూ ఆరోగ్యంగా, వయసుకు తగ్గట్టుగా ఎదుగుతోంటే భయపడాల్సిన పనీ లేదు. ఒక్కసారిగా బరువు తగ్గడం లేదా అసలు పెరగట్లేదు అన్నప్పుడే కంగారుపడాలి. బరువు ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటే సులువుగా జీర్ణమయ్యే ఆహారం ఇస్తే సరిపోతుంది. ఎగ్‌ పుడింగ్‌, పీనట్‌ బటర్‌ శాండ్‌విచ్‌, స్మూథీలు, కొబ్బరి చట్నీ.. ఇవన్నీ ఇవ్వండి. దేన్నైనా బలవంతంగా అలవాటు చేయడం కంటే.. వాళ్లు తినేవాటిలోనే కొంత భిన్నంగా చేసి ఇస్తే సరి. మొలక విత్తనాల పిండి జావ, నెయ్యి, అన్ని చిరుధాన్యాలనూ నానబెట్టి కూరగాయలతో ఉడికించి పులావ్‌గాగానీ, పెరుగుతో కలిపిగానీ ఇవ్వొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని