రెండేళ్లు వెనకబడింది...

మా పాపకు ఆరేళ్లు. మాట్లాడుతుంది కానీ స్పష్టత ఉండదు. కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవడంలో వెనకబడుతోంది. దీంతో సైకాలజిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లాం. రెండేళ్లు వెనక ఉందన్నారు. బిహేవియరల్‌ థెరపీ ఇప్పించమన్నారు.

Updated : 30 May 2022 12:28 IST

మా పాపకు ఆరేళ్లు. మాట్లాడుతుంది కానీ స్పష్టత ఉండదు. కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవడంలో వెనకబడుతోంది. దీంతో సైకాలజిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లాం. రెండేళ్లు వెనక ఉందన్నారు. బిహేవియరల్‌ థెరపీ ఇప్పించమన్నారు. కానీ మాకు దగ్గర్లో అందుబాటులో లేదు. ఇంట్లోనే ఉండి చేయించగలిగేవి ఏమైనా ఉన్నాయా కాస్త చెప్పండి

- ఒక సోదరి

మీరు చెబుతున్న ప్రకారం మీ పాప రెండేళ్లు వెనకబడింది కనుక నాలుగేళ్ల వయసులో చేయగలిగే పనులు చేస్తోంది. ప్రస్తుతం ఆ వయసు పిల్లలతో కలిసి ఉండేలా చేయండి. ఆరేళ్ల వయసుకు తినడం, స్నానం చేయడం లాంటి తన పనులు కొద్దిపాటి సాయంతో సొంతంగా చేసుకోగలగాలి. విషయాన్ని అర్థం చేసుకుని వాక్యాలను స్పష్టంగా మాట్లాడగలగాలి. మనం చెప్పేది, చేసేది గ్రహించి తాను నేర్చుకోగలగాలి. ఇతరులతో ఎంతవరకూ కలవగలుగుతోంది, ఎలా ప్రవర్తిస్తోంది, సామాజిక పరిపక్వత ఎంతవరకూ ఉంది, తన పనులు తాను ఎంతవరకూ చేసుకోగలుగుతోంది- ఇవన్నీ పాప మాటలు, చేతల ద్వారా కొంతవరకూ అర్థమవుతుంది. ఐక్యూ పరీక్ష చేసి పాప సామర్థ్యాలను తెలుసుకుంటారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా పాప తన వయసుకి తగినట్లు తన పనులు తాను చేసుకునేలా (సెల్ఫ్‌ హెల్ప్‌ స్కిల్స్‌), పరిసరాలకు తగినట్లుగా ప్రవర్తించేలా (ఎడాప్టివ్‌ ఫంక్షనింగ్‌), ఇతరులతో కలవగలిగేలా (సోషల్‌ స్కిల్స్‌) తర్ఫీదిస్తారు. క్రమంగా పాపలో మార్పు వస్తుంది. ఒకటి రెండు సిట్టింగులకు తీసికెళ్లగలిగితే అక్కడ వారు నేర్పించే విధానం చూసి, తర్వాత మీరు ఇంట్లో సాధన చేయించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని