డ్యాన్స్ చేసి చూడండి..
వీనులవిందైన సంగీతం వినిపిస్తే పసిపిల్లలు కూడా కాలు కదుపుతారు. అలా మనసును ఉత్సాహపరిచే డ్యాన్స్ మెదడుకే కాదు.. శరీరానికీ ఎన్నో ప్రయోజనాలిస్తాయంటున్నారు నిపుణులు..
వీనులవిందైన సంగీతం వినిపిస్తే పసిపిల్లలు కూడా కాలు కదుపుతారు. అలా మనసును ఉత్సాహపరిచే డ్యాన్స్ మెదడుకే కాదు.. శరీరానికీ ఎన్నో ప్రయోజనాలిస్తాయంటున్నారు నిపుణులు..
మనసులో దాచుకున్న భావోద్వేగాలను బయటికి తీసుకొచ్చే శక్తి నృత్యానికి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మనసంతా భారంగా ఉన్నప్పుడు కాలుకదిపి కాసేపు వేసే డ్యాన్స్‌తో ఆ వేదనంతా దూదిపింజలా ఎగిరిపోయి.. ఉత్సాహంగా అనిపిస్తుంది. శరీరాన్ని, మనసును అనుసంధానం చేసే అద్భుతమైన శక్తి డ్యాన్స్‌లో ఉంది. అధిక బరువు ఉండేవారు ప్రతిరోజు అరగంట డ్యాన్స్‌కు కేటాయిస్తే 200 కెలోరీలు తగ్గొచ్చు. సాధారణంగా చేసే వ్యాయామంతో దానికి తగినట్లుగా ఆయా అవయవాల్లోని కండరాలు కదులుతాయి. డ్యాన్స్‌లో మాత్రం మొత్తం శరీరంలోని కండరాలన్నింటిలో కదలిక ఉంటుంది. దీంతో శారీరక సామర్థ్యం మెరుగుపడుతుంది.
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్(యూసీఎల్‌ఏ) హెల్త్ రిసెర్చ్ మేరకు నృత్యం శారీరకమైన వ్యాయామం మాత్రమే కాదు, మానసికారోగ్యాన్ని కూడా పెంపొందిస్తుందని గుర్తించారు. ఈ పరిశోధన కోసం ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుకు గురై మానసికంగా అనారోగ్యంగా ఉన్న 1000మందిని ఎంపిక చేసి పరిశీలించారు. వీరిలో డ్యాన్స్ చేసిన వారిలో 98 శాతంమంది త్వరితగతిన ఈ అనారోగ్యం నుంచి బయటపడినట్లు తెలిసింది. నడక, స్ట్రెచింగ్, నృత్యం మెదడును అలసిపోకుండా చేస్తాయి. వయసుపైబడినవారికి కూడా మెదడును నృత్యం ఉత్సాహంగా మారుస్తుంది.
మానసికంగా..
డ్యాన్స్ నలుగురెదుట చేయడం తెలిసినవారికి పబ్లిక్ స్పీకర్‌గా అందరిముందు ధైర్యంగా మాట్లాడగలిగే నైపుణ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు కూడా ఓ అరగంట సేపు డ్యాన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. పిల్లలతో కాసేపు సరదాగా వేసే నాలుగు స్టెప్స్ కూడా మీ శారీరక, మానసికారోగ్యాన్ని పెంచుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
బ్యూటీ & ఫ్యాషన్
- అరేబియన్ల అందం వెనుక..!
- హెయిర్ ఎక్స్టెన్షన్స్ వాడుతున్నారా?
- బొమ్మ లెహెంగాల సోయగం...
- వీటితో ‘ఐ మేకప్’ వేసుకోవడం సులువు!
- హ్యాండ్‌బ్యాగు కాదిది... లంచ్ బ్యాగు
ఆరోగ్యమస్తు
- Pregnancy Tips : పొట్ట దురద పెడుతోందా?
- పాదాలపై ఒత్తిడి తగ్గాలంటే...
- అందుకే నేలపై కూర్చొని తినాలట!
- వ్యాయామం మిస్ అవుతున్నారా
- బరువు తగ్గించే సోంపు టీ!
అనుబంధం
- తప్పటడుగు వేశాడు.. క్షమించాలా?
- అందుకే పిల్లలకూ ఆధ్యాత్మికత అవసరం!
- విసిగిపోకుండా వివరిద్దామా..
- సంకోచంగా కనిపిస్తే....
- పెళ్లైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటోంది..!
యూత్ కార్నర్
- ఆమె మాటలే.. నన్ను గనుల్లోకి నడిపించాయి!
- వారమంతా ఉద్యోగం.. వారాంతాల్లో వ్యాపారం!
- లక్షల మందికి సాయం.. షార్క్‌లతో సావాసం!
- Payal Chhabra: దేశం కోసం విదేశీ ఆఫర్లనూ తిరస్కరించింది!
- ప్రపంచ గమనాన్ని మార్చేందుకే నా పర్యటనలు!
'స్వీట్' హోం
- గుడ్డు పెంకులు సులభంగా రావాలంటే..!
- అతికించేస్తే సరి
- స్విచ్ బోర్డు.. శుభ్రమిలా!
- కాటన్ బాల్స్‌ని ఇలా కూడా వాడచ్చు!
- ఇలా చేస్తే దోమల బెడద ఉండదు!
వర్క్ & లైఫ్
- థైరాయిడ్ సమస్యా..
- పని ప్రదేశంలో వారికే వేధింపులెక్కువట!
- మీకు మీరే రక్ష!
- Women Reservation Bill : 33 శాతానికి.. మూడు దశాబ్దాలు పట్టింది?
- సిబ్బందిలో ప్రేరణ కలిగించాలంటే..!