వారిలో సానుకూలత పెంచాలి..

ఇంట్లో ఏ విషయాన్నైనా నెగిటివ్‌గా మాట్లాడే భర్త తీరును పిల్లలు కూడా అనుసరిస్తారేమో అని భయపడుతుంది అదితి. యుక్తవయసులోకి అడుగుపెడుతున్నవారికి సానుకూలతగా ఆలోచించడం నేర్పాలంటున్నారు నిపుణులు.

Published : 06 Jun 2022 01:24 IST

ఇంట్లో ఏ విషయాన్నైనా నెగిటివ్‌గా మాట్లాడే భర్త తీరును పిల్లలు కూడా అనుసరిస్తారేమో అని భయపడుతుంది అదితి. యుక్తవయసులోకి అడుగుపెడుతున్నవారికి సానుకూలతగా ఆలోచించడం నేర్పాలంటున్నారు నిపుణులు.

రీక్షల్లో వైఫల్యం ఎదురైన సందర్భాల్లో పిల్లలు ముభావంగా ఉంటారు. అప్పుడు వారితో మాట్లాడాలి. మీరున్నారనే భరోసా వారికివ్వాలి. అప్పుడే వారి మనసులోని బాధను బయటకు చెప్పగలుగుతారు. అలాకాకుండా పెద్దవాళ్లు వినకుండా కోప్పడితే వారు నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఒంటరివాళ్లమనే భావంతో ఆత్మనూన్యత నింపుకొంటారు. అది వారి భవిష్యత్తునే అంథకారంగా మార్చే ప్రమాదం ఉంది. వారి చుట్టూ సానుకూలవాతావరణం, సంభాషణ మాత్రమే ఉండేలా చూస్తే మంచిది.

వ్యక్తీకరించేలా.. యుక్తవయసులోకి అడుగుపెట్టిన తర్వాత కెరియర్‌, స్నేహం వంటి అంశాలపై వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. వాటికి విలువనివ్వాలి. వారికి మాట్లాడే అవకాశాన్నిచ్చి, అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పనివ్వాలి. వారి మనసేంటో, లక్ష్యాలేంటో తెలుసుకోవాలి. దాంతో మనసు విప్పి మాట్లాడిన సంతోషం వారికీ కలుగుతుంది.

భద్రత.. భద్రత గురించి మాట్లాడుతూ పిల్లలను ఎక్కడికీ వెళ్లనివ్వకుండా ఉండకూడదు. కొందరు భద్రత అంటూ పిల్లలపై చిన్నవాటికీ.. ఆంక్షలు విధిస్తుంటారు. ఇది సరైనది కాదంటున్నారు నిపుణులు. కొంత పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి.  ఎదురయ్యే ఎటువంటి సమస్యనైనా దాటి రాగలిగే స్వీయభద్రతను నేర్పాలి. అప్పుడే వారిలో ధైర్యం పెరుగుతుంది. ప్రమాదంపై అవగాహన అందించాలి. శారీరక, మానసికారోగ్యాన్ని కాపాడుకోవడమెలాగో నేర్పించాలంటే తల్లిదండ్రులు మంచి విధానాలను పాటిస్తూ పిల్లలు తమను అనుసరించేలా చేయాలి. 

స్ఫూర్తి నింపి.. లక్ష్యసాధనలో పిల్లలకు పెద్దవాళ్లు వెన్నుముకగా మారాలి. స్ఫూర్తి నింపి ప్రోత్సాహించాలి. వారితో మెలిగేటప్పుడు కొన్ని హద్దులను పెద్దవాళ్లు పాటించాలి. వారి స్పేస్‌ వారికందించాలి. పిల్లలకు గౌరవమేంటి అని భావించకుండా వారికీ మర్యాద ఇస్తే తిరిగి అంతే మర్యాద వాళ్లు ఇతరులకివ్వడం నేర్చుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని