మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు...
ఎన్ని చట్టాలొచ్చినా నేరాలూ ఘోరాలూ జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వార్తలు పత్రికల్లోనో, టీవీలోనో చూసినప్పుడల్లా బాధా, భయమూ కలిగే మాట నిజం. గబుక్కున మన పిల్లలు గుర్తొస్తారు. బయటికెళ్లిన వాళ్లు సురక్షితంగా తిరిగి రావాలని తపిస్తాం. ఈ నేపథ్యంలో ఆడపిల్లలు...
ఆడపిల్లల భద్రత కోసం
ఎన్ని చట్టాలొచ్చినా నేరాలూ ఘోరాలూ జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వార్తలు పత్రికల్లోనో, టీవీలోనో చూసినప్పుడల్లా బాధా, భయమూ కలిగే మాట నిజం. గబుక్కున మన పిల్లలు గుర్తొస్తారు. బయటికెళ్లిన వాళ్లు సురక్షితంగా తిరిగి రావాలని తపిస్తాం. ఈ నేపథ్యంలో ఆడపిల్లలు పరిస్థితులూ పరిసరాలనూ అర్థం చేసుకునేలా, తమను తాము కాపాడుకునేలా తర్ఫీదివ్వమని సూచిస్తున్నారు నిపుణులు. మీరు చెప్పాల్సిన జాగ్రత్తలివీ...
కాస్తంత పరిచయం ఉన్నంతలో వాళ్లను నమ్మి బైకు మీదో కారులోనో ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దు. పరిచయస్థులు డ్రైవ్‌కు వెళ్దామని మొహమాట పెడుతుంటే అమ్మానాన్నలు కోప్పడతారని తప్పించుకోండి.
* రాత్రి వేళల్లో వీలైనంత వరకూ ఒంటరి ప్రయాణాలు వద్దు. తప్పనిసరైతే ఆటో నంబర్ అతని ఎదురుగానే రాసి అమ్మానాన్నలకు పంపుతున్న సంగతి తెలిసేలా చేయండి. దానివల్ల అతడిలో కొంత భయం నెలకొంటుంది. ఏమాత్రం అనుమానా స్పదంగా అనిపించినా 100 కాల్ చేస్తే అది కంట్రోల్ రూమ్‌కు వెళ్తుంది, దగ్గర్లో ఉన్న పోలీసులను అప్రమత్తం చేస్తారు.
* వెలుగు రాకముందు, నిర్మానుష్య ప్రదేశాల్లో వాకింగు, జాగింగులు వద్దు.
* బయటకు వెళ్లేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఉంటే అవసరమైతే ఎమర్జెన్సీ కాల్ చేయొచ్చు. ఎక్కడికి, ఎవరితో వెళ్తోందీ ఇంట్లో తప్పక చెప్పాలి. ఒకవేళ ప్రణాళిక మారితే ఆ సంగతీ తెలియజేయాలి. కొత్త ప్రదేశానికి వెళ్తే ట్రాఫిక్‌తో సహా అన్నీ చెబితే ఆపద ముంచుకొస్తే ఉపయుక్తంగా ఉంటుంది.
* ఇయర్ ఫోన్స్ తక్కువ శబ్దంలో పెట్టుకుంటే పక్కనేం జరుగుతోందో గ్రహించగలరు.
* ఎప్పుడెలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు కనుక పెప్పర్ స్ప్రే పర్సులో ఉంచుకోండి.
* పోకిరీలు ఇబ్బంది కలిగిస్తోంటే ఎవరేమనుకుంటారో అని సందేహించద్దు. బిగ్గరగా అరిస్తే చుట్టూ ఉన్నవాళ్లు ఆదుకుంటారు. ఎవరూ లేరంటే స్వయంగా పోరాటానికి దిగాలి. దీర్ఘకాలం పాటు కరాటే, తైక్వాండో వంటివి నేర్చుకునే ఆసక్తి లేకపోతే... స్వల్పకాల సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులకు వెళ్లడం చాలా అవసరం. చిన్న చిన్న టెక్నిక్‌లతో పోకిరీలను మట్టి కరిపించే పద్ధతులను అక్కడ నేర్పుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.