నలుగురిలో జాగ్రత్త!

మనచుట్టూ అన్యోన్యంగా ఉండే జంటలతోబాటు గొడవపడే వారినీ చూస్తుంటాం. ఆ వైరం ముదిరి అందరూ వినేలా దెబ్బలాడుకుంటే అది కాస్తా వైరలైపోతుంది. చిరాకులూ పరాకులూ వ్యతిరేకతలూ విభేదాలూ.. ఏవైనా సరే నాలుగ్గోడల మధ్యే పరిష్కరించుకోమని హితవు పలుకుతున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు....

Updated : 14 Jun 2022 03:03 IST

మనచుట్టూ అన్యోన్యంగా ఉండే జంటలతోబాటు గొడవపడే వారినీ చూస్తుంటాం. ఆ వైరం ముదిరి అందరూ వినేలా దెబ్బలాడుకుంటే అది కాస్తా వైరలైపోతుంది. చిరాకులూ పరాకులూ వ్యతిరేకతలూ విభేదాలూ.. ఏవైనా సరే నాలుగ్గోడల మధ్యే పరిష్కరించుకోమని హితవు పలుకుతున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు.

కోపతాపాలొచ్చినప్పుడు పోట్లాడుకోవడం మామూలే. తర్వాత మీరెటూ అన్నీ మర్చిపోయి, అరమరికలు లేకుండా ప్రేమగానే ఉంటారు. కనుక ఇంట్లోనే వాదించుకోండి... పక్కింటి, ఎదురింటి వాళ్లు వినేలా కాదు. మీ క్షణికావేశం ఎందరికో వినోదం అవుతుందని మర్చిపోవద్దు. ఇంకొందరు ఆ విషయాన్ని చిలవలు పలవలుగా చేసి చులకనగా మాట్లాడే అవకాశం కూడా ఉంది.

ఇంట్లోనే కాదు, బయటికెళ్లినప్పుడూ అభిప్రాయ భేదాలు వస్తాయి. షాపింగ్‌లోనో, బంధువులింటికి వెళ్లినప్పుడో విభేదాలు తలెత్తాయనుకోండి... సర్దిచెప్పుకోండి. ఆ క్షణమే తేలిపోవాలనుకుంటే మాటా మాటా పెరిగి ఘర్షణగా మారుతుంది.

‘మీ గొడవలో తలదూర్చే అవకాశం మూడో వ్యక్తికి ఇచ్చారంటే మీ అనుబంధానికి గండిపడినట్టే. పునరావృతం అయిందో ఇక ఆ బంధం బీటలువారిపోవడం తద్యం’ అంటుంది ప్రముఖ సామాజికవేత్త మెలనీ షాపిరో.

‘పదిమందిలో గొడవపెట్టుకుంటే రెండో వ్యక్తికి ఆగ్రహం హెచ్చుతుంది. ఫీలింగ్స్‌ దెబ్బతింటాయి. అవమానకరంగా తలవంపులుగా, అగౌరవంగా ఉంటుంది. అయిష్టాన్ని, వ్యతిరేకతను తెలియజేయడానికి హుందా అయిన పద్ధతి ఉంటుంది. అది తప్పినప్పుడు ఇద్దరి మధ్యా ప్రేమ నశిస్తుంది’ అంటుంది క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ జోషువా క్లాపో.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని