భవిష్యత్తులో బాధపడొద్దంటే..

కలకాలం నిలవాలనే ఉద్దేశంతోనే వివాహ బంధంలోకి అడుగుపెడతామెవరైనా. కానీ కొన్ని సందర్భాల్లో కొద్దికాలానికే పొరపొచ్చాలు వస్తుంటాయి. విడిపోవడానికీ కారణం అవుతుంటాయి. దీనికి సంబంధించిన సూచనలు పెళ్లికి ముందు నుంచే తెలుస్తాయంటారు నిపుణులు. కాస్త గమనించాలంతే! అవేంటో.. తెలుసుకోండి.

Updated : 21 Jun 2022 05:08 IST

కలకాలం నిలవాలనే ఉద్దేశంతోనే వివాహ బంధంలోకి అడుగుపెడతామెవరైనా. కానీ కొన్ని సందర్భాల్లో కొద్దికాలానికే పొరపొచ్చాలు వస్తుంటాయి. విడిపోవడానికీ కారణం అవుతుంటాయి. దీనికి సంబంధించిన సూచనలు పెళ్లికి ముందు నుంచే తెలుస్తాయంటారు నిపుణులు. కాస్త గమనించాలంతే! అవేంటో.. తెలుసుకోండి.

నమ్మకం.. బంధమేదైనా ఇదే పునాది. మీ బాగోగులు తెలుసుకోవడానికి అడిగే సమాచారం వేరు. మీపై నిఘా ఉంచినట్లుగా ప్రవర్తించడం వేరు. చేస్తున్న ప్రతి పనినీ, మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి గురించీ ఆరా తీస్తుంటే కాస్త ఆలోచించండి. పొసెసివ్‌నెస్‌ చూపిస్తున్నాడని కొట్టిపారేస్తే.. అనుమానం.. పెనుభూతం అన్నమాట విన్నారు కదా! అదింకా పెరగొచ్చు.

అలా చేస్తోంటే.. చిలిపి తగాదాలు, వాదనలు ఎవరికైనా సహజమే! సరదా సరదాగా సాగుతోంటే ఫర్లేదు. అప్పుడప్పుడూ చిన్న బుచ్చుకున్నా.. తిరిగి కలిసిపోవచ్చు. అలాకాక మీ రూపురేఖలు, వ్యక్తిత్వాన్ని గేలి చేయడం, ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడటం చేస్తుంటే పునఃపరిశీలించుకోవడం మంచిది. బంధంలో కనీస గౌరవం ఉండాలి. అది లేకపోతే బంధం ఎంతో కాలం నిలబడదు.

అదీ తప్పే.. చాలాసార్లు బాధించడం శారీరకమే అనుకుంటారు. మరి మనసు సంగతేంటి? అదీ వేధింపు కింద లెక్కే! అరవడం, ఏం చేసినా తప్పు లెంచడడం, మాటలనడం.. మంచి ప్రవర్తన కిందకి రాదు. మనవాళ్లే అని సర్దుకుంటూ పోతే చివరికి ఒత్తిడి, మానసిక సమస్యలకు దారితీయొచ్చు.

మరి మీ సంగతి?... కలిసి నడవాలంటే ఇద్దరి భాగస్వామ్యమూ ఉండాలి. ఎంతసేపూ నేను, నాది అని ఆలోచించే వారితో ప్రయాణం కొనసాగదు. తన అవసరాలు, తన ఆనందం గురించే పట్టించుకుంటూ మీ భావోద్వేగాలకు విలువివ్వట్లేదా? ఫుల్‌స్టాప్‌ పెట్టేయండి. లేదంటే మానసికంగా అలసిపోతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని