పిల్లలకి క్షమాపణ చెబుతున్నారా?

ఇంట్లో పిల్లలు చేసే చిన్న పొరపాట్లకీ గయ్‌మని అరుస్తారు కొందరు. కాసేపటి తర్వాత చిట్టి మనసుని అకారణంగా గాయపరిచానే అనుకుని బాధపడటమూ సహజమే. అలాంటప్పుడు పిల్లలకి క్షమాపణలు చెబితే ఇద్దరికీ ఊరట.

Published : 24 Jun 2022 00:41 IST

ఇంట్లో పిల్లలు చేసే చిన్న పొరపాట్లకీ గయ్‌మని అరుస్తారు కొందరు. కాసేపటి తర్వాత చిట్టి మనసుని అకారణంగా గాయపరిచానే అనుకుని బాధపడటమూ సహజమే. అలాంటప్పుడు పిల్లలకి క్షమాపణలు చెబితే ఇద్దరికీ ఊరట.

* క్షమాపణలు చెప్పడం ద్వారా మీరూ పిల్లల ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు అర్థమవుతుంది.

* పొరపాట్లు చేసేముందు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత తెలుస్తుంది.

* క్షమాపణలు ఎలా చెప్పాలో, ఎందుకు చెప్పాలో నేర్చుకుంటారు.

* పెద్దవాళ్లే క్షమాపణలు చెబితే, అది మీ వ్యక్తిత్వం అని వాళ్లకి అర్థమవుతుంది. దాని ద్వారా నేర్చుకుంటారు కూడా.

* ఏదో మాట వరసకి ‘సారీ’ అనేయడం కాదు, మీ క్షమాపణలో నిజాయతీ ఉందని వాళ్లకి అర్థమవ్వాలి. ‘నువ్విలా చేసుంటే నేనలా అనేదాన్ని కాదు’ లాంటి షరతులతో కూడా క్షమాపణలు వద్దు. బేషరతుగా ‘నేను కోప్పడి ఉండాల్సింది కాదు’ అని చెప్పండి. అదే సమయంలో ప్రతిసారీ కోప్పడుతూ క్షమాపణలు చెప్పకుండా, అలాంటి పరిస్థితిలో కాసేపు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. మీ మౌనం కూడా పిల్లలకి పెద్ద పాఠమే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్