అనుబంధం పెంచుకోండిలా

రాగిణి, భగత్‌లు ప్రేమవివాహంతో ఒక్కటైన జంట. ఉద్యోగులు కావడంతో కాసేపైనా కలిసి మాట్లాడుకోవడానికి సమయం ఉండదు. ఇరువురి మధ్య దూరం పెరుగుతోందేమో అనే ఆలోచన రాగిణిని బాధపెడుతోంది. ఉదయం వర్కవుట్లు, వారాంతాల్లో తోటపని వంటివి జంటగా కలిసి చేయడానికి ప్రయత్నిస్తే ఆ క్షణాలు ఇరువురి మధ్య అనుబంధాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు...

Updated : 02 Jul 2022 07:26 IST

రాగిణి, భగత్‌లు ప్రేమవివాహంతో ఒక్కటైన జంట. ఉద్యోగులు కావడంతో కాసేపైనా కలిసి మాట్లాడుకోవడానికి సమయం ఉండదు. ఇరువురి మధ్య దూరం పెరుగుతోందేమో అనే ఆలోచన రాగిణిని బాధపెడుతోంది. ఉదయం వర్కవుట్లు, వారాంతాల్లో తోటపని వంటివి జంటగా కలిసి చేయడానికి ప్రయత్నిస్తే ఆ క్షణాలు ఇరువురి మధ్య అనుబంధాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు.

దయం రన్నింగ్‌ లేదా జాగింగ్‌, ఆ తర్వాత చేసే వ్యాయామాలను దంపతులిద్దరూ కలిసి పూర్తిచేయాలి. జిమ్‌కు వెళ్లడానికి సమయం లేకపోతే ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చూస్తూ ఇంట్లోనే వర్కవుట్లు చేసే సౌకర్యం ఉంది. ఒకరికొకరు పోటీగా చేసే వ్యాయామాలు ఇరువురిలోనూ ఉత్సాహాన్ని నింపుతాయి. నిండైన ఆరోగ్యమూ సొంతమవుతుంది. కలిసి చేశామన్న సంతోషం దక్కుతుంది. ఆ సమయం ఇరువురి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.  

వారాంతంలో.. ప్రతి రోజు హడావుడిగా ఎవరికివారు పనులు పూర్తిచేసుకొని ఆఫీస్‌కు వెళ్లినా కూడా.. వారాంతాన్ని తమ కోసమే కేటాయించుకోవాలి. ప్రణాళికాబద్ధంగా వంటావార్పు కలిసి చేయడం, ఒకరికిష్టమైనవి మరొకరు వండి రుచి చూపించడం వంటివి ఇరువురి నడుమ అనుబంధాన్ని ముడివేస్తాయి. ఇంటి శుభ్రతలోనూ ఇద్దరూ పాలుపంచుకుంటూ పూర్తిచేస్తే కష్టం, అలసట దరికి చేరవు. తోటపనిలో ఒకరికొకరు సాయపడితే ఆ సమయం కూడా భాగస్వామితో కలిసి కబుర్లు చెప్పుకోవచ్చు.

సరదాగా.. మనసుకు నచ్చిన ప్రాంతాన్ని సందర్శించి రావడానికి ప్రతి మూడు నెలలకొకసారి ప్రత్యేకంగా నాలుగు రోజులను కేటాయించుకోవాలి. ఇరువురి అభిరుచులకు తగిన ప్రాంతాన్ని ఎంచుకొని, పర్యటిస్తే చాలు. అవన్నీ మరవలేని మధురజ్ఞాపకాలుగా మారతాయి. దంపతుల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి. జంటగా నడిస్తే జీవితమంతా సంతోషమయమే అవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్