చిన్నారులు పాఠశాలకు వెళుతుంటే...

రమణి కూతురు స్కూల్‌కు ఉత్సాహంగా బయలుదేరితే, కొడుకు మాత్రం రోజూ మానేస్తానంటాడు. ఇలాంటి వారి విషయంలో ఏం చేయాలో నిపుణులు చెబుతున్నారిలా.రోజూ నిర్ణీత సమయానికి నిద్రలేపాలి. వారు ఉత్సాహంగా

Updated : 13 Jul 2022 09:48 IST

రమణి కూతురు స్కూల్‌కు ఉత్సాహంగా బయలుదేరితే, కొడుకు మాత్రం రోజూ మానేస్తానంటాడు. ఇలాంటి వారి విషయంలో ఏం చేయాలో నిపుణులు చెబుతున్నారిలా.

రోజూ నిర్ణీత సమయానికి నిద్రలేపాలి. వారు ఉత్సాహంగా లేవాలంటే రాత్రుళ్లు త్వరగా నిద్రపోయేలా చూడాలి. క్రమశిక్షణగా వారి పనులను వారే చేసుకునేలా అలవాటు చేయాలి. ఆలస్యంగా నిద్రలేవడంతో హోంవర్క్‌ పూర్తికాదు. దీంతో హడావుడిగా స్కూల్‌కు వెళుతూ అల్పాహారం తీసుకోరు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఎంత త్వరగా నిద్రలేస్తే అంత ప్రశాంతంగా పనులన్నీ పూర్తి చేసుకోవచ్చని పిల్లలకు అవగాహన కలిగించాలి. అల్పాహారం వల్ల ప్రయోజనాలు చెప్పాలి. అలాకాక ఉదయం నుంచి కోప్పడి, దండించడం, ఇలాగైతే చదువు మానిపించేస్తా అంటూ మాట్లాడకూడదు. ఇది వారి లేత మనసుల్లో ఆందోళన, ఒత్తిడిని పెంచుతాయి. వారి శారీరక, మానసిక ఎదుగుదల ప్రభావితమవుతుంది. చదువులో వెనకబడతారు.

ఫోన్‌లో..

సెలవల్లో పిల్లలెక్కువగా ఫోన్‌ లేదా టీవీకి అలవాటుపడి ఉంటారు. ఇప్పుడు అకస్మాత్తుగా వాటి నుంచి దూరంగా ఉంచడానికి ప్రయత్నించినా అది చెడు ప్రభావం చూపుతుంది. ఈ అలవాటును క్రమేపీ తగ్గించాలి. స్కూల్‌నుంచి వచ్చాక పిల్లలకు నిర్ణీత సమయాన్ని కేటాయించి ఫోన్‌ లేదా టీవీకి అనుమతించాలి. ఆ తర్వాత హోంవర్క్‌ పూర్తి చేయాలనే నిబంధన ఉంచాలి. స్నేహితులతో కాసేపు ఆడుకునేలా ప్రోత్సహిస్తే, క్రమేపీ స్క్రీన్‌కు దూరమవుతారు. నిద్రపోయే ముందు ఆ రోజు పాఠశాలలో జరిగిన విశేషాలు, పాఠ్యాంశాల గురించి అడగాలి. వారు చెప్పే ప్రతి విషయాన్నీ శ్రద్ధగా వినాలి. పాఠాలు అర్థమవుతున్నాయో లేదో తెలుసుకోవాలి. కొత్త స్నేహితుల గురించి చెప్పమనాలి. ఇవన్నీ వారిలో ఉత్సాహాన్ని నింపుతాయి. చదువుపై ఆసక్తిని పెంచుతాయి. అంతేకాక వారానికొకసారి తరగతి ఉపాధ్యాయులను కలిసి పిల్లల ప్రవర్తన, చదువు గురించి వివరాలు సేకరించాలి. అలాగే పిల్లల సమస్యలనూ వారికి చెప్పాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్