బెదిరిస్తున్నారా?

పిల్లలు దారికి రాకపోతే వాళ్లని హాస్టల్లో వేస్తామని, ఊరికి పంపించేస్తామని ఇలా రకరకాలుగా అమ్మానాన్న బెదిరిస్తుంటారు. అయితే, వీటితో ప్రయోజనం తాత్కాలికమే అంటున్నారు నిపుణులు. చిన్నారులను సుతిమెత్తగా, మంచి మాటలతో దార్లో పెట్టడమే ఉత్తమం అంటున్నారు.

Published : 16 Jul 2022 00:20 IST

పిల్లలు దారికి రాకపోతే వాళ్లని హాస్టల్లో వేస్తామని, ఊరికి పంపించేస్తామని ఇలా రకరకాలుగా అమ్మానాన్న బెదిరిస్తుంటారు. అయితే, వీటితో ప్రయోజనం తాత్కాలికమే అంటున్నారు నిపుణులు. చిన్నారులను సుతిమెత్తగా, మంచి మాటలతో దార్లో పెట్టడమే ఉత్తమం అంటున్నారు.

బెదిరింపులూ, భయపెట్టడాలూ పిల్లలమీద ఎక్కువ కాలం పనిచేయవు. పనిచేసినా అది వారి భవిష్యత్తుకీ మంచిది కాదు. పిల్లలు మన ఆధీనంలో ఉంటేనే ఇవి నమ్ముతారు. కానీ కొందరు వీటిని తేలిగ్గా తీసుకుంటారు. పదే పదే ఇలా చెప్పినా విలువ ఉండదు. ఇలాంటివి పిల్లలూ, తల్లిదండ్రుల మధ్య బంధానికీ చేటు చేస్తాయి. వారిచేత ఏదైనా పని చేయించాలంటే ఇలా ప్రయత్నించండి.

1. పిల్లలకి ఆసక్తి కలిగించే, ఆటల్లా ఉండే, అవసరమైన పనుల్నే చెప్పండి.

2. చెప్పిన పని చేయకుంటే ఎలాంటి పనిష్మెంట్‌ ఇస్తారన్నది కాకుండా చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో వివరించండి.

3. పొద్దున్నే నిద్రలేవడం, హోమ్‌వర్క్‌ చేయడం, టిఫిన్‌ తినడం... ఇలాంటివాటి గురించి మారాం చేసినపుడు ఆ పనులు ఎంత ముఖ్యమో, అవి చేయకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో విడమర్చి చెప్పండి.

4. కొందరు చిన్న చిన్న విషయాలకే పిల్లల మీద గయ్‌మంటారు. అది పిల్లలకే కాదు మీకూ మంచిది కాదు. చిన్న విషయాల్ని చూసీ చూడనట్టు వదిలిపెట్టేయండి.

5. పిల్లలకు సంబంధించి కాకుండా మీకోసం, ఇంటి కోసం ఏదైనా పని చెప్పినప్పుడు.. ‘ఆ పని కాస్త చేసి పెట్టమ్మా’.. అంటూ బతిమాలుతున్నట్టుగా అడగండి. దాంతో వాళ్లకు చెయ్యాలా, చెయ్యకూడదా అన్న సందేహమే లేకుండా వెంటనే ఆ పనిచేస్తారు. ఇలా చేస్తే క్రమంగా పిల్లల్లో మార్పు వస్తుంది. తద్వారా పెద్దయ్యాకా ఇదే అలవాటవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్