అనుమానం వద్ద్దు..

దంపతుల మధ్య అనుమానం ఏర్పడితే ఆ బంధం ఎంతోకాలం నిలవదు.  ఆత్మన్యూనత చోటు చేసుకున్నప్పుడు ఎదుటి వారిపై అనుమానం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో చెబుతున్నారిలా... 

Published : 21 Jul 2022 01:31 IST

దంపతుల మధ్య అనుమానం ఏర్పడితే ఆ బంధం ఎంతోకాలం నిలవదు.  ఆత్మన్యూనత చోటు చేసుకున్నప్పుడు ఎదుటి వారిపై అనుమానం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో చెబుతున్నారిలా... 

అన్యోన్యంగా సాగే దాంపత్యాన్ని కూడా బీటలువార్చే శక్తి అనుమానానికి ఉంది. ఏ ఆధారమూ లేకుండా ప్రతీ క్షణం అనుమానించే భాగస్వామితో సంతోషంగా కలిసి జీవించలేరు. అనుమానం ఇరువురి మధ్య దూరాన్ని పెంచి, మానసిక బంధాన్ని బలహీన పరుస్తుంది. ఇది ఇరువురిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బంధం తెగే వరకూ సాగుతుంది. సమస్య వచ్చినప్పుడు దంపతులిద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి. అవతలి వారితో ఏర్పడుతున్న సమస్యను ధైర్యంగా వారెదుటే చెప్పగలగాలి. అందులో ఎంత నిజం ఉందో అడిగి తెలుసుకోవాలి. అనుమానానికి గురైన వారు తమపై ఏర్పడిన అభిప్రాయం తప్పు అయితే, దాన్ని వివరంగా చెప్పడానికి ప్రయత్నించాలి. 

మూడోవ్యక్తికి..

ఇతరులను అనుమానించేముందు దానికి కారణాలను ఆలోచించాలి. ఎవరో ఏదో చెబితే అనుమానిస్తున్నామా అనేది గుర్తించాలి. అలాగైతే మూడో వ్యక్తికి మాట్లాడే అవకాశం దంపతులివ్వకూడదు. నిజమేంటో తెలుసుకోకుండా తీవ్ర పదజాలంతో అవతలి వ్యక్తిని బాధ పెట్టకూడదు. ఇది భార్యాభర్తల బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఏ సమస్య అయినా కలిసి చర్చించుకుంటే చాలు. పరిష్కారం దొరుకుతుంది.

ఆత్మవిశ్వాసం..

అనుమానానికి గురైనవారు లేదా అనుమానించే వారు.. ఇద్దరూ తమ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. అపార్థం చోటు చేసుకున్నప్పుడు ఇరువురి మానసికారోగ్యాన్ని ప్రభావితం చేసి, మనసు, మెదడు సరైనరీతిలో ఆలోచించే గుణాన్ని కోల్పోయేలా చేస్తుంది. అటువంటి సమయంలో తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు. అనుమానం పెను భూతమని గ్రహించి, దానికి దూరంగా ఉండటానికి కృషి చేయాలి. మనసు నిండా ఎదుటివారిపై అనుమానాన్ని నింపుకోకుండా, అవతలివారు చెప్పేది పూర్తిగా విని దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. లేదంటే మనసు ప్రతికూల ఆలోచనలతో నిండిపోయే ప్రమాదం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్