చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా..
తన ఎనిమిదేళ్ల కొడుకుని ఎక్కడకు తీసుకెళ్లాలన్నా స్వాతికి భయమే. ఇంటికి అతిథులొస్తున్నా కంగారే. ఇంట్లో, బయట.. ఎక్కడైనా.. చెడ్డ మాటలు మాట్లాడుతున్న వాడిని ఎలా నియంత్రించాలో తెలియక సతమతమవుతోంది. ఇందుకు కారణం చుట్టుపక్కల వాతావరణమే అంటున్నారు నిపుణులు. వారిలో మార్పు తెచ్చేందుకు ఏం సూచిస్తున్నారంటే..
తన ఎనిమిదేళ్ల కొడుకుని ఎక్కడకు తీసుకెళ్లాలన్నా స్వాతికి భయమే. ఇంటికి అతిథులొస్తున్నా కంగారే. ఇంట్లో, బయట.. ఎక్కడైనా.. చెడ్డ మాటలు మాట్లాడుతున్న వాడిని ఎలా నియంత్రించాలో తెలియక సతమతమవుతోంది. ఇందుకు కారణం చుట్టుపక్కల వాతావరణమే అంటున్నారు నిపుణులు. వారిలో మార్పు తెచ్చేందుకు ఏం సూచిస్తున్నారంటే..
ఎప్పుడూ లేని విధంగా పిల్లల నోటి వెంట చెడ్డ మాటలు వినగానే పెద్దవాళ్లు షాక్ అవడం సహజం. చిన్నారులు తామెక్కడో విన్న పదాన్ని గుర్తు పెట్టుకొని మరీ కొత్తగా ఉందని అలా మాట్లాడతారు. నిజానికి ఆ పదాల అర్థం, దానివల్ల ఎదుటివారికి కలిగే ఇబ్బంది గురించి అవగాహన ఉండదు. కొత్తపదాలను వాడాలన్నదే వారి ఆలోచన. వాటిని స్నేహితులు, సహవిద్యార్థులు పలకడం విని ఉంటారు. ముందుగా వారెక్కడ ఆ మాటలను విన్నారో అడిగి తెలుసుకోవాలి. అలా మాట్లాడకూడదని స్నేహపూరితంగా చెప్పాలి. వారెక్కడ విన్నారో తెలిశాక మరోసారి అలాంటి వాతావరణం పిల్లలకు ఎదురు పడకుండా చూడాలి.
ఇంట్లోనే చెక్..
కొన్ని చోట్ల తల్లిదండ్రుల నుంచే పిల్లలు చెడ్డపదాలు నేర్చుకుంటుంటారు. చిన్నారులెదుట కోపంగా మాట్లాడుకోవడం, ఒకరినొకరు దుర్భాషలాడటం వంటివన్నీ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. తిరిగి వాటిని ఎదుటివారిపై ప్రయోగిస్తారు. కోపం వచ్చినప్పుడల్లా వాటిని ఉపయోగిస్తుంటారు. చిన్నారులెదుట పెద్దవాళ్లు తిట్టుకోకూడదు. ఏదైనా వాదించుకునే ముందు ఎదురుగా పిల్లలున్నారనే స్పృహ పెద్దవాళ్లకుంటే మంచిది.
సరదా కాదు..
కొంతమంది తల్లిదండ్రులు కొన్ని మాటలు సాధారణమన్నట్టు మాట్లాడతారు. కానీ చిన్నారుల వద్ద మాట్లాడే ప్రతి మాటా విలువైనదిగా ఉండాలి. వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం పెద్దవాళ్ల బాధ్యత. అలాగే పిల్లల నోటివెంట ఎప్పుడైనా చిన్న చెడ్డ పదం వినిపించినా వెంటనే ఖండించాలి. మృదువుగా అది తప్పు అని చెప్పాలి. అలాకాకుండా ఏదో సరదాగా అన్నాడులే అనుకుంటే, తను మాట్లాడిన దాంట్లో తప్పు లేదనే భావన పిల్లలకు కలిగే ప్రమాదం ఉంది. తక్షణం ఖండించడం, తప్పు అని చెప్పడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!