పరిపూర్ణతకి ప్రయత్నిస్తున్నారా?
సుమతి కూతురు ప్రతిసారి తను వేసిన బొమ్మను అందంగా రాలేదని చించేస్తుంది. మరింత బాగా వేయడానికి ప్రయత్నించినా చేతకావడం లేదంటూ ఆందోళనకు గురవుతుంది. ప్రతి పనిలోనూ పూర్తి పరిపూర్ణత కోసం ప్రయత్నించడం కన్నా, మెరుగ్గా చేయడానికి
సుమతి కూతురు ప్రతిసారి తను వేసిన బొమ్మను అందంగా రాలేదని చించేస్తుంది. మరింత బాగా వేయడానికి ప్రయత్నించినా చేతకావడం లేదంటూ ఆందోళనకు గురవుతుంది. ప్రతి పనిలోనూ పూర్తి పరిపూర్ణత కోసం ప్రయత్నించడం కన్నా, మెరుగ్గా చేయడానికి కృషి చేస్తే చాలు అని పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలంటున్నారు నిపుణులు. లేదంటే ఆత్మన్యూనతకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన పిల్లలను ప్రశంసించాలి. అలాకాకుండా మరో రెండు మార్కులు వస్తే వందకు వంద వచ్చేవి కదా, తరగతిలోనే ప్రథమస్థానంలో నిలిచేవాడివి కదా అని చెప్పడం వారి మనసును అసంతృప్తికి గురిచేస్తుంది. మరో రెండు మార్కులు తెచ్చుకోలేకపోయాననే ఆలోచన మొదలవుతుంది. మరోసారి ఆ పోటీలో గెలవడానికి విశ్వప్రయత్నం చేసి, తిరిగి ఆ స్థాయికి చేరుకోలేనప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఇది క్రమేపీ వారిని ఆరోగ్యకరమైన పోటీతత్వం నుంచి అవతలివారిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదల, కసి తెచ్చుకునేలా చేస్తుంది. పరిపూర్ణంగా మారలేకపోతున్నామనే కుంగుబాటుకు గురవుతారు. ఇది వారి మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపి చదువులోనే కాదు, పెద్దైన తర్వాత కెరీర్లోనూ వెనకబడతారు.
చేయూతగా..
పిల్లలు చేసిన ప్రతి పనిని మెచ్చుకోగలగాలి. వారి అభిరుచులను అడిగి తెలుసుకొని వాటిలో ప్రోత్సహించాలి. మనసుకు నచ్చిన కెరియర్ ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలి. అవసరమైతే సలహాలు, సూచనలు అందించాలి. అలాకాకుండా పెద్దవాళ్లు తాము చెప్పేదే సరైనదని, అప్పుడే అన్నింటిలో ద బెస్ట్ కావొచ్చని ఒత్తిడి తేకూడదు. ఇలా చేస్తే పిల్లల్లో ఆసక్తి తగ్గుతుంది. కెరియర్ ఎంచుకొనేటప్పుడు వీరిలో సందిగ్దత చోటు చేసుకుంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. వాళ్ల మార్గంలో చేయూతనందించాలి తప్ప, వారి అభిప్రాయాలను కించపరచకూడదు.
ప్రయత్నం..
శరీరరంగు, ఎత్తు వంటి అంశాలకు ప్రాముఖ్యతనిచ్చేలా పిల్లలతో మాట్లాడకూడదు. శరీరఛాయపై ఆధారపడేదే.. అసలైన అందమనే అభిప్రాయాన్ని వారి మనసులో నింపకూడదు. దీంతో పిల్లలు తమ గురించి తాము తక్కువగా ఆలోచించడం మొదలుపెడతారు. తాము అందంగా లేమని అసంతృప్తి మొదలవుతుంది. అందరూ సమానమే, దేనికీ పరిపూర్ణత అంటూ ఉండదని చిన్నారులకు అవగాహన కలిగించాలి. అప్పుడే తమని తాము విమర్శించుకోకుండా ఉంటారు. వారిలో ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!