చదువుపై అనాసక్తి...

కిరణ్‌ను రోజూ స్కూల్‌కు పంపడానికి వాళ్లమ్మ పడే తిప్పలు చెప్పాలంటే అదో ప్రహసనమే. మనసులో ఎన్నో భయాలతోనే ఇలా బడికి వెళ్లనని, చదువుకోనని మారాం చేస్తారని చెబుతున్నారు నిపుణులు...

Published : 11 Aug 2022 00:54 IST

కిరణ్‌ను రోజూ స్కూల్‌కు పంపడానికి వాళ్లమ్మ పడే తిప్పలు చెప్పాలంటే అదో ప్రహసనమే. మనసులో ఎన్నో భయాలతోనే ఇలా బడికి వెళ్లనని, చదువుకోనని మారాం చేస్తారని చెబుతున్నారు నిపుణులు...

ఉదయం కడుపునొప్పి అంటూ స్కూల్‌కెళ్లడానికి కొందరు సాకులు చెబుతారు. ‘చదువుకోకపోతే స్కూల్‌ మాన్పించి ఏదైనా పనిలో చేరుస్తా, అన్నయ్య, అక్క ఎలా చదువుకుంటున్నారో చూడు, నువ్వు దేనికీ పనికిరావు’ అని కోప్పడకూడదు. దండించకూడదు. ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోగలగాలి. చదువుపై ఆసక్తి లేదా, లేదంటే.. స్కూల్‌కి వెళ్లడానికి ఇష్టపడటం లేదా అనేది గుర్తించాలి. తోటి విద్యార్థులతో ఏదైనా సమస్య ఉందేమో.. లేదా ఉపాధ్యాయుల వద్ద ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నాడా తెలుసుకోవాలి. క్లాస్‌ టీచర్‌ను కలిసి మాట్లాడటం, తోటి పిల్లలతో మాట్లాడి కనుక్కోవడం ద్వారా కొంత వరకు సమస్య ఏంటో తెలుస్తుంది. అప్పుడు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తే చాలు.

విరామం.. స్కూల్‌లో అన్నీ బానే ఉండి, వెళ్లనని మారాం చేస్తే మాత్రం పిల్లలకు చదువుకోవడంపై ఆసక్తి తగ్గిందని గుర్తించాలి. హోం వర్క్‌, చదవాల్సినవి ఎక్కువగా ఉండటం, ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటివి పిల్లలను ఒత్తిడికి గురిచేస్తాయి. ఇతర పిల్లలతో పోలిక, పెరుగుతున్న పోటీ వారిని తీవ్ర ఆందోళనకు కలిగిస్తాయి. దీంతో వారి మనసు విరామం కోరుకుంటుంది. చదువును గుదిబండగా భావించి దాన్నుంచి దూరంగా జరగాలనుకొని అనాసక్తిగా ప్రవర్తిస్తారు. దీన్నుంచి బయటకు తేవడానికి ప్రయత్నించాలి. జీవితానికి చదువు అనేది ఎంత విలువైందో చెప్పడానికి బలవంతంగా పుస్తకాల ముందు కూర్చోబెట్టకుండా ముందు వాళ్లను మానసికంగా సిద్ధం చేయాలి.

అభిరుచి.. వాళ్లకిష్టమైనది ఏంటో తెలుసుకోవాలి. ఆడుకోవడం, బొమ్మలు వేయడం, పుస్తకపఠనం ఇలా వారి అభిరుచిని ప్రోత్సహించాలి. ఒత్తిడిని దూరం చేసుకోవడంలో అభిరుచిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పాలి. వాళ్లకు ఇష్టమైన టూర్‌కు తీసుకెళ్లాలి. వ్యాయామం, నృత్యం వంటివీ అలవరచాలి. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం నేర్పాలి. వాళ్లతో పెద్ద వాళ్లు ఆడటం, సరదాగా కబుర్లు, కథలు చెప్పడం వంటివన్నీ వారిలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఒత్తిడి నుంచి క్రమేపీ దూరమవుతారు. జీవితంలో ఏదో ఒక కొత్తదనాన్ని నింపుకోవడమెలాగో నేర్పితే చాలు. చదువుపై ఆసక్తి చూపించడమే కాదు, ఇష్టమైన కెరియర్‌ను ఎంచుకొని ముందడుగు వేస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్