వానల్లో ఏం వేద్దాం!

వర్షాలు కురుస్తున్నప్పుడు ఏం దుస్తులు ధరించాలా అని చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా కాస్తో కూస్తో తడవకపోము... ఎక్కడో అక్కడ బురద చిందకపోదు. మరి ఇది పెద్దవాళ్లకు మాత్రమే సమస్యా? కానే కాదు.

Updated : 18 Aug 2022 11:42 IST

ర్షాలు కురుస్తున్నప్పుడు ఏం దుస్తులు ధరించాలా అని చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా కాస్తో కూస్తో తడవకపోము... ఎక్కడో అక్కడ బురద చిందకపోదు. మరి ఇది పెద్దవాళ్లకు మాత్రమే సమస్యా? కానే కాదు. పిల్లల విషయంలో ఇంకా ఎక్కువగా ఆలోచించాల్సిందే అంటున్నారు నిపుణులు. చెమ్మగా, తడితడిగా ఉండే ఈ వాతావరణంలో మూడేళ్లలోపు చిన్నారుల దుస్తులు వారికి వెచ్చదనాన్నిచ్చేలా ఉండాలి. వర్షంలో పిల్లలను తడవనివ్వకుండా జాగ్రత్తపడినా.. తేలికైన దుస్తులైతే వారికి మరింత సౌకర్యాన్ని ఇస్తాయి. బయటకు వెళ్లినప్పుడు వేసే అవుట్‌ఫిట్స్‌ ఎంపికలో మోకాళ్లపైకి ఉండే వాటికి ప్రాధాన్యమివ్వాలి. షార్ట్‌ ఫ్రాక్‌, నీ లెంత్‌ ప్యాంటు, షార్ట్‌ లేదా స్కర్టు సౌకర్యంగా ఉంటాయి.

వస్త్రం.. తరచూ పడే వర్షాల వల్ల వాతావరణం చల్లగా మారుతూనే ఉంటుంది. ఈ చల్లదనాన్నుంచి చిన్నారులకు వెచ్చదనాన్ని అందించేలా లైట్‌వెయిట్‌ కాటన్‌, రేయాన్‌ లేదా లినెన్‌ వంటివి ఎంచుకుంటే మంచిది. అంతేకాదు, బయటకెళ్లి వస్తే చాలు ఎంతో కొంత బురద చిందకుండా ఉండదు. ఆ మరకలు తేలికగా పోయి, త్వరగా ఆరే రింకిల్‌ ఫ్రీ కాటన్‌, రేయాన్‌ వస్త్రశ్రేణి అయితే మంచిది. అలాగే బయటికెళ్లినప్పుడు అనుకోకుండా వర్షపు చినుకులు పడినా పీల్చని దుస్తులు వేయాలి. నైలాన్‌ లేదా రేయాన్‌ నీటిని త్వరగా పీల్చవు. ఈ దుస్తులు పెద్దగా తడవవు. చినుకులు పడినప్పుడు ఆ తడి కిందకు జారిపోతుంది.

టీ షర్ట్‌తో.. కాటన్‌ లేదా లినెన్‌ టీ షర్టులు ఈ సీజన్‌లో పిల్లలకు సౌకర్యంగా ఉంటాయి. లేత వర్ణాలైతే మురికి, బురద త్వరగా కనబడతాయి. ఆకర్షణీయమైన, ముదురు వర్ణాలవి ఎంపిక చేస్తే చిన్నారులకు నప్పుతాయి. లైట్‌వెయిట్‌ కాటన్‌ డెనిమ్‌ గౌన్లు పిల్లలకు వెచ్చదనాన్ని అందిస్తూనే తేలికగానూ అనిపిస్తాయి. డాంగ్రీస్‌ లేదా గీతలు, ప్రింట్స్‌ ఉండే అవుట్‌ఫిట్స్‌ కూడా పిల్లలకు సరైన ఎంపిక. గొడుగు, రెయిన్‌కోట్‌ వంటివి బ్యాగులో ఉంటే అవసరమైనప్పుడు చిన్నారులకు వినియోగించొచ్చు. ఊలుతో అల్లే పోంఖాస్‌ వేస్తే వెచ్చదనాన్ని అందిస్తాయి. వర్షంలోనైనా తేలికగా నడవడానికి వీలు కల్పించే ఫ్లిప్‌-ప్లాప్స్‌ ఎంచుకోవాలి. ఇవైతే బురదలో జారిపోనివ్వవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్