దూరం పెంచుకోవద్దు..

వినుతి పెళ్లైన కొత్తలో వాళ్లాయన తనతో ప్రతి విషయాన్నీ పంచుకునేవాడు. క్రమేపీ అతడికి ఆ అలవాటు తగ్గింది. తమ మధ్య దూరం పెరిగిందేమో అనే భయం వినుతిలో మొదలైంది. దంపతుల

Published : 16 Aug 2022 01:01 IST

వినుతి పెళ్లైన కొత్తలో వాళ్లాయన తనతో ప్రతి విషయాన్నీ పంచుకునేవాడు. క్రమేపీ అతడికి ఆ అలవాటు తగ్గింది. తమ మధ్య దూరం పెరిగిందేమో అనే భయం వినుతిలో మొదలైంది. దంపతుల మధ్య అనుబంధం పెరగాలే తప్ప, తరగకూడదంటున్నారు నిపుణులు.

భార్యాభర్తల మధ్య కొత్తలో ఉన్న ఆకర్షణ, ప్రేమ క్రమేపీ పెరగాలే తప్ప, తగ్గకూడదు. పెళ్లైనప్పుడు ఒకరంటే మరొకరికి గొప్పగా ఉంటుంది. అంతకు మించిన వ్యక్తులు మరెక్కడా ఉండరనుకుంటారు. నెమ్మదిగా ఇరువురి బలహీనతలు, లోపాలు బయటకొస్తే, విమర్శించుకోవడం మొదలు పెడతారు. తామే అధికులమని ఇద్దరూ భావిస్తారు తప్ప, ఒకరి బలహీనతలను మరొకరు తెలుసుకొని నడుచుకోవాలనే ఆలోచన రాదు. అవతలివారిలో లోపాలనే చూస్తారు తప్ప, మంచి విషయాలను గుర్తించరు. బలహీనతలకే ప్రాముఖ్యతనిస్తారు. క్రమేపీ ఇది ఇరువురి మధ్య దూరాన్ని పెంచుతుంది. దాంతో ఆ బంధం బీటలువారుతుంది.

స్పందించాలి..

దంపతుల్లో ఎవరు మాట్లాడినా ఎదుటి వారు వెంటనే స్పందించాలి. వారు చెప్పేది పూర్తిగా వినాలి. అప్పుడే వారి మనసేంటో అర్థమవుతుంది. అలాకాక ఆసక్తి చూపించకపోతే, అవతలి వారికి మరోసారి ఏ అంశాన్నీ ప్రస్తావించాలనిపించదు. అప్పుడిక వారి సమస్యలను చెప్పడానికి కూడా ముందుకు రారు. అందుకే ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వారి స్థానంలో ఉండి ఆలోచించగలగాలి. అవతలివారికి అది సంతోషాన్నిస్తుంది. తమ అభిప్రాయంతో ఏకీభవించకపోయినా, కనీసం వింటున్నారనే సంతృప్తి కలుగుతుంది. ఆ తర్వాత ఎందుకు ఏకీభవించలేకపోతున్నాననే దానిపై సున్నితంగా వివరణనివ్వాలి. ఇవన్నీ చర్చను ప్రశాంతంగా ముగిసేలా చేస్తాయి.

అభినందన..

రుచికరమైన ఆహారం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం, సమయం వచ్చినప్పుడు మంచి సలహాలివ్వడం, పిల్లల పెంపకంలో నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాల్లో దంపతులిద్దరూ ఎదుటివారి ప్రత్యేకతను గుర్తించి అభినందించాలి. ఆ చిన్న ప్రశంస అవతలి వారికి సంతోషాన్నిస్తుంది. పెళ్లైన కొత్తలో చిన్నచిన్న విషయాలకు కూడా ఎలా అభినందించుకునే వారో గుర్తు చేసుకోండి. ఆ అలవాటును దూరం చేసుకోకూడదు. అలాకాకుండా ఏదీ పట్టించుకోనట్లు ఉండటం కూడా ఎదుటి వారిలో నిరుత్సాహాన్ని నింపుతుంది. ఇద్దరూ ఉద్యోగస్తులైనా, రోజంతా ఆఫీస్‌, ఫోన్‌ అంటూ గడపకుండా, టెక్‌ ఫ్రీ జోన్‌గా రోజులో కనీసం గంటసేపైనా కేటాయించుకొని ఆ సమయాన్ని భాగస్వామితో పంచుకోవాలి. అవి కొన్ని క్షణాలైనా.. ఇరువురి మనసును అనుబంధంతో ముడివేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్