వారికీ కావాలి.. ఉల్ల్లాసం

బంటి స్కూల్‌ నుంచి వచ్చాక నిరుత్సాహంగా ఉంటాడు. కొన్నిసార్లు బడికి వెళ్లడానికి కూడా ఆసక్తి లేనట్లుగా కనిపిస్తాడు. దీనికి కారణం వారిని తల్లిదండ్రులు ఉత్సాహపరచకపోవడమే అంటున్నారు నిపుణులు.. పెద్దవాళ్లకులాగే పిల్లలూ అప్పుడప్పుడూ రిఫ్రెష్‌ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే వారిలో నిరుత్సాహం చోటు చేసుకుంటుంది. ఈ భావన అకస్మాత్తుగా రాకపోవచ్చు....

Updated : 30 Aug 2022 04:24 IST

బంటి స్కూల్‌ నుంచి వచ్చాక నిరుత్సాహంగా ఉంటాడు. కొన్నిసార్లు బడికి వెళ్లడానికి కూడా ఆసక్తి లేనట్లుగా కనిపిస్తాడు. దీనికి కారణం వారిని తల్లిదండ్రులు ఉత్సాహపరచకపోవడమే అంటున్నారు నిపుణులు..

పెద్దవాళ్లకులాగే పిల్లలూ అప్పుడప్పుడూ రిఫ్రెష్‌ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే వారిలో నిరుత్సాహం చోటు చేసుకుంటుంది. ఈ భావన అకస్మాత్తుగా రాకపోవచ్చు. వరుసగా కొన్ని సంఘటనలు వారి మనసుపై ప్రభావం చూపించి క్రమేపీ ఏదో కోల్పోయినట్లుగా మారతారు. ఇది చదువుపై ఆసక్తిని తగ్గిస్తుంది. తోటివారితో ఆడుకోరు, లేదా ఇంట్లో గతంలోలాగా ఉత్సాహంగా ఉండరు. ఈ మార్పును గుర్తించి రిఫ్రెష్‌ చేయాలి. అలాకాక చదవడం లేదని, సరిగ్గా తినడం లేదని కోప్పడుతూ, ఇతర పిల్లలతో పోల్చి తిడితే ఆ నిస్తేజం పెరిగే ప్రమాదం ఉంది.

ఇష్టమైనవి..

హోంవర్క్‌కి పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి. ఇష్టంగా కూర్చుంటేనే చిన్నారులు ఏకాగ్రత చదవగలుగుతారు. ఇందుకోసం వారికిష్టమైన పెన్‌, పెన్సిల్‌, ప్యాడ్‌ వంటివి అందించాలి. చదువయ్యాక ఆడుకుందాం లేదా తోటపని చేద్దాం, నీకోసం చూస్తున్నా అనే మాటలు వారిలో ఉత్సాహాన్ని నింపుతాయి. డైరీ అలవాటు చేసి, అందులో ఆ రోజు చేసిన మంచిపని లేదా వారికిష్టమైన పని రాయించాలి. వారి లక్ష్యాలు, ఆశలు, ఆశయాలూ పొందుపరచమనాలి. వాటిని పూర్తి చేయడానికి పెద్దవాళ్లు తమ సహకారం ఉంటుందని చెబితే చాలు. పిల్లల్లో నూతన ఉత్సాహం నిండుతుంది. రిఫ్రెష్‌ అవుతారు.

ఆ తర్వాతే...

స్కూల్‌ నుంచి రాగానే ముందు ఆ రోజు విశేషాలు, స్నేహితుల గురించి ఉత్సాహంగా అడగాలి. ఆడిన ఆటల గురించి తెలుసుకోవాలి. తను బడికి వెళ్లినప్పుడు ఇంట్లో జరిగిన ఏవైనా సంఘటనల గురించి హాస్యంగా చెప్పాలి. తనకిష్టమైనవి వండినప్పుడు ఎంత సమయం పట్టింది, ఆ వంట ఎలా వచ్చింది వంటివన్నీ ఆసక్తిగా వివరించాలి. అలా వారితో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా వారి మనసు స్కూల్‌ ఒత్తిడి నుంచి బయటపడి రిఫ్రెష్‌ అవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని