ఆహారం ఆకర్షణీయంగా..

మాధురి కొడుక్కి నాలుగేళ్లు.. అయినా  వాడికి ఇష్టమైనవేంటో గుర్తించలేకపోయింది. ఏదీ పూర్తిగా తినడు. అందుకే చిన్నారులకు ఆహారాన్ని ఆకర్షణీయంగా అందించాలంటున్నారు నిపుణులు.. రోజురోజుకీ మారే రుచులను గుర్తించడం చిన్నారులకు కష్టం. ఏదైనా కొత్త ఆహారాన్ని పిల్లలు ఇష్టపడాలన్నా.. అలవాటు పడాలన్నా 10కన్నా ఎక్కువసార్లు తింటేనే ఆ రుచిని వారు గుర్తించగలరు.

Published : 03 Sep 2022 00:16 IST

మాధురి కొడుక్కి నాలుగేళ్లు.. అయినా  వాడికి ఇష్టమైనవేంటో గుర్తించలేకపోయింది. ఏదీ పూర్తిగా తినడు. అందుకే చిన్నారులకు ఆహారాన్ని ఆకర్షణీయంగా అందించాలంటున్నారు నిపుణులు..

రోజురోజుకీ మారే రుచులను గుర్తించడం చిన్నారులకు కష్టం. ఏదైనా కొత్త ఆహారాన్ని పిల్లలు ఇష్టపడాలన్నా.. అలవాటు పడాలన్నా 10కన్నా ఎక్కువసార్లు తింటేనే ఆ రుచిని వారు గుర్తించగలరు. ఆ తర్వాతే దాన్ని ఇష్టపడతారు. ఒకసారి తినిపించినప్పుడు ఆసక్తి చూపకపోయినా తిరిగి మరికొన్నిసార్లు పిల్లలకు దాన్ని అందించడం తప్పనిసరి. ఆ తర్వాత కూడా ఆ బుజ్జాయి ఇష్టపడకపోతే నచ్చలేదని అర్థం చేసుకొని మరొక కొత్తరకాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నించాలి.

రకరకాలుగా..

రంగురంగుల్లో రకరకాల గింజధాన్యాలు, చిలగడ, బంగాళాదుంపలు, క్యారెట్‌, బీట్‌రూట్‌, చిక్కుడు, శనగలు, పప్పులు, విత్తనాలు, పాలు, పెరుగు, వెన్న, చేప, చికెన్‌, తాజా పండ్లు వంటివి పరిచయం చేయాలి. ఆహారాన్ని వర్ణమయంగా కనిపించేలా చేస్తే చిన్నారులు దానిపై ఆసక్తి పెంచుకుంటారు. రుచికీ అలవడతారు. కూరగాయలు మాత్రమే అందించినప్పుడు ఇష్టపడకపోతే, ఒక తాజా పండు, ఉడికించిన పప్పు లేదా దుంపలు వంటివి రెండురకాల ఆహారాన్ని విడిగా ఇవ్వాలి. ఏదో ఒకదానిపై తప్పనిసరిగా ఆసక్తి కనబరుస్తారు.

దగ్గరగా..

ఆరేడేళ్ల వయసు పిల్లలను మార్కెట్‌కు తీసుకెళ్లి అక్కడ రకరకాల కూరగాయలు, పండ్లను పరిచయం చేయాలి. వాటిలో ఏది వారికిష్టమో అడగాలి. ఆయా పేర్లు, వర్ణాల వివరాలను నేర్పించాలి. వాటి వాసన చూసి, చేతిలోకి తీసుకునేటప్పుడు పిల్లలకు కొత్త అనుభూతి కలుగుతుంది. రుచి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. క్రమేపీ వాటిని ఇష్టపడి, పోషకాహారానికి దగ్గరవుతారు. అంతేకాదు, తల్లిదండ్రుల మంచి ఆహారపు అలవాట్లను పిల్లలు అనుసరిస్తారు. పోషకాహారం తీసుకోవడంలో పిల్లలకు పెద్దవాళ్లు స్ఫూర్తిగా ఉంటే మంచిది.

బలవంతపెట్టొద్దు..

పెట్టిన ఆహారంలో పిల్లలు సగం తినకపోయినా నిరాశ పడకూడదు. బలవంతపెట్టకూడదు. బదులుగా జంక్‌ఫుడ్‌, చాక్లెట్లు అలవాటు చేయకూడదు. వారి పొట్టకు సరిపోయేలా మాత్రమే తినగలరు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోలేరు. అలాకాక తక్కువ పరిమాణంలో, ఎక్కువసార్లు ఆహారాన్ని అందించడం కూడా మంచి పద్ధతి. ఒకసారి అన్నం, పప్పు, మరోసారి పండ్లు, ఇంకోసారి పాల ఉత్పత్తులు ఇలా ప్రతిసారీ కొత్తగా తినిపిస్తే పిల్లలకు ఆసక్తితోపాటు సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్