ఇవి చెప్పొద్దు..

వైవాహికబంధం లేదా ప్రేమబంధంలో తమ మధ్య ఎటువంటి రహస్యం ఉండకూడదని ముందుగానే ఇరువురూ ప్రమాణం చేసుకుంటుంటారు. అయితే కొన్ని ముఖ్యమైన అంశాలు భాగస్వామితో చెప్పడం లేదా చర్చించడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎదుటివారిని ఎంతగా ప్రేమించినా కొన్ని విషయాలు వారితో మాట్లాడక పోవడమే మంచిది. అప్పుడే ఆ బంధం ఆరోగ్యకరంగా కొనసాగుతుంది.

Published : 03 Sep 2022 00:19 IST

వైవాహికబంధం లేదా ప్రేమబంధంలో తమ మధ్య ఎటువంటి రహస్యం ఉండకూడదని ముందుగానే ఇరువురూ ప్రమాణం చేసుకుంటుంటారు. అయితే కొన్ని ముఖ్యమైన అంశాలు భాగస్వామితో చెప్పడం లేదా చర్చించడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

దుటివారిని ఎంతగా ప్రేమించినా కొన్ని విషయాలు వారితో మాట్లాడక పోవడమే మంచిది. అప్పుడే ఆ బంధం ఆరోగ్యకరంగా కొనసాగుతుంది. ఏదీ దాచకుండా భాగస్వామికి చెబితే వెంటనే బేధాభిప్రాయం రాకపోవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడోఒకప్పుడు ఆ అంశమే పెద్ద వివాదానికి కారణమవ్వచ్చు. అది బంధాన్ని బలహీనపరిచే ప్రమాదంగా మారుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కొన్నింటిని చెప్పకపోవడం మంచిదే. బంధువులు, స్నేహితులు లేదా అతిదగ్గర వాళ్లు భాగస్వామి గురించి విమర్శలు చేసినప్పుడు వాటిని వారితో పంచుకోకూడదు. ఒకవేళ చెబితే వాటికి కారణం భాగస్వామి కావొచ్చనే అపార్థం తలెత్తే అవకాశం ఉంది. లేదా ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని తనను తక్కువ చేస్తున్నారేమో అనే ఆలోచనా రాకపోదు. 

తొలిసారిగా.. కొందరు తమ భాగస్వామిని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డా అంటారు. అలా అందరికీ జరగాలని లేదు. తొలిసారి అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలియనప్పుడు కొందరికి మొదట ప్రేమ కలగదు. తెలుసుకున్న తర్వాత క్రమేపీ ప్రేమించడం మొదలుపెడతారు. అందుకే నిన్ను మొదటిసారి చూసినప్పుడు ప్రేమ కలగలేదు అని ఎప్పటికీ చెప్పకూడదు. సందర్భం వచ్చినా.. నవ్వుతూ తప్పించుకోవాలే తప్ప, అప్పుడు ప్రేమ కలగలేదు, ఇప్పుడు ప్రేమిస్తున్నా అంటే సమస్య కొని తెచ్చుకున్నట్లే. ఈ సమాధానం అవతలివారి మనసును బాధపెట్టే అవకాశం ఉంది. అది కోపంగానూ మారొచ్చు.

గతం.. గతంలో బ్రేకప్‌ విషయం లేదా ఫలానా వారిని ఇష్టపడ్డాను, కానీ వారికి అది తెలియక ప్రేమగా మారలేదు... లాంటి విషయాలు ఎప్పటికీ చెప్పొద్దు. అప్పటికి దాన్ని తేలికగా తీసుకున్నట్లు భావించినా, వారి మనసులో మీ మాటలు నిక్షిప్తమై ఉంటాయి. సమయం వచ్చినప్పుడు లేదా ఏదైనా వాదనప్పుడు ఆ అంశం అవతలివారి మనసు నుంచి బయట పడుతుంది. అలాగే స్నేహితులతో భాగస్వామిని పోల్చి అప్పటి విషయాలను మాట్లాడకూడదు. ఇవన్నీ బంధాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది. అందుకే కొన్నింటిని చెప్పి దూరం కావడం కన్నా, చెప్పకుండా కలిసి ఉండటం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్