అలా నేర్పిస్తున్నా!
ప్రతీది తల్లిగా నా అదుపాజ్ఞల్లో జరగాలనే అనుకోను. కానీ కొన్ని విలువలని నేర్పించడానికి మాత్రం ప్రయత్నిస్తుంటా. ఏది కావాలన్నా... నువ్వే కష్టపడి సంపాదించుకోవాలని నాకు అమ్మానాన్న చెప్పారు. స్కూల్‌కి బస్‌లోనే వెళ్లేదాన్ని. అదే విషయం నా పిల్లలిద్దరికీ చెప్పాలనుకున్నా. పెద్దబాబు తైమూర్‌కి ఏడో నెలరాగానే షూటింగ్‌లకి వెళ్లడం మొదలుపెట్టా.
ప్రతీది తల్లిగా నా అదుపాజ్ఞల్లో జరగాలనే అనుకోను. కానీ కొన్ని విలువలని నేర్పించడానికి మాత్రం ప్రయత్నిస్తుంటా. ఏది కావాలన్నా... నువ్వే కష్టపడి సంపాదించుకోవాలని నాకు అమ్మానాన్న చెప్పారు. స్కూల్‌కి బస్‌లోనే వెళ్లేదాన్ని. అదే విషయం నా పిల్లలిద్దరికీ చెప్పాలనుకున్నా. పెద్దబాబు తైమూర్‌కి ఏడో నెలరాగానే షూటింగ్‌లకి వెళ్లడం మొదలుపెట్టా. ఇంటికొచ్చేటప్పటికి వాడు బేల మొహం పెడితే ‘నేను పని చేస్తున్నా కాబట్టే నువ్వు హాయిగా ఎంజాయ్ చేస్తున్నావ్... కోరినవన్నీ పొంద గలుగుతున్నావ్’ అని వివరిస్తుంటా. వీడికి సినిమాలంటే చాలా ఇష్టం. కానీ స్కూల్ రోజుల్లో కాకుండా వారాంతాల్లో మాత్రమే చూసేలా నచ్చచెప్పాను. పిల్లలందరినీ మూస పోసినట్టు ఒకే పద్ధతిలో పెంచలేం. ప్రతి పిల్లాడూ ప్రత్యేకమే. వాళ్లని అర్థం చేసుకోవడానికి అనుక్షణం మనం మారుతూ ఉండాలి.
- కరీనా కపూర్, బాలీవుడ్ నటి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.