ఇరువురి నడుమ..

రమ్య, రమేశ్‌ల నడుమ నిత్యం ఏదో ఒక భేదాభిప్రాయం వస్తూనే ఉంటుంది. అది సర్దుకునేలోపు మరొకటి. భార్యాభర్తల మధ్య ఇటువంటి సమస్య ఉన్నప్పుడు కొన్ని థెరపీ టెక్నిక్స్‌ను కలిసి పాటిస్తే ఆ సంసార నావ సంతోషంగా సాగిపోతుందంటున్నారు నిపుణులు. సంస్కృతి, సంప్రదాయాలు వేరు వేరుగా ఉండే కుటుంబాల నుంచి వచ్చే ఇరువురు వ్యక్తులు మూడుముళ్ల బంధంతో ఒకటవుతారు.

Published : 14 Sep 2022 00:38 IST

రమ్య, రమేశ్‌ల నడుమ నిత్యం ఏదో ఒక భేదాభిప్రాయం వస్తూనే ఉంటుంది. అది సర్దుకునేలోపు మరొకటి. భార్యాభర్తల మధ్య ఇటువంటి సమస్య ఉన్నప్పుడు కొన్ని థెరపీ టెక్నిక్స్‌ను కలిసి పాటిస్తే ఆ సంసార నావ సంతోషంగా సాగిపోతుందంటున్నారు నిపుణులు.

సంస్కృతి, సంప్రదాయాలు వేరు వేరుగా ఉండే కుటుంబాల నుంచి వచ్చే ఇరువురు వ్యక్తులు మూడుముళ్ల బంధంతో ఒకటవుతారు. అంత మాత్రాన ప్రతి అంశంలోనూ ఇద్దరూ ఏకాభిప్రాయం కలిగి ఉండాలనే నియమం లేదు. ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకే మనస్తత్వంతో ఉండరు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇరువురూ ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించి మర్యాదనిస్తే చాలు. అభిప్రాయ భేదాలు సహజం. అయితే ఎదుటివారు తనలాగే ఆలోచించాలని కాకుండా, వాళ్లు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా విని వారి ఆలోచనావిధానాన్ని గ్రహించాలి. తన మాటే వినాలనే పట్టుదల కూడా భాగస్వామిలో ఉండకూడదు. అవతలివ్యక్తికీ తన అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశాన్నివ్వాలనే ఆలోచన ఉంటే చాలు. సమస్యలెదురవ్వవు.

చర్చతో..

ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. సినిమా, రాజకీయం, చరిత్ర, బాల్యం, క్రీడలు వంటి ఎన్నో అంశాలున్నాయి. వాటి గురించి చర్చించినప్పుడు ఎదుటివారికి ఎందులో ఆసక్తి ఉందో తెలుస్తుంది. అనుకోకుండా అభిప్రాయాలు, అభిరుచులు కలిసే అవకాశాలూ.. ఉంటాయి. లేదా ఒకరికి ఎందులోనైనా ఎక్కువ విషయాలు తెలుసనిపిస్తే, వారి నుంచి ఆసక్తిగా వాటి గురించి అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టొచ్చు. అలాగే ఎదుటివారి అభిరుచిని ప్రోత్సహించొచ్చు. ఇవన్నీ ఇరువురినీ మంచి స్నేహితులుగా మారుస్తాయి. క్రమేపీ అనుబంధాన్ని పెనవేసుకునేలా చేస్తాయి. ఆ తర్వాత చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా వెంటనే పరిష్కరించుకొనే మానసిక స్థాయికి ఇరువురూ చేరుకుంటారు.

విమర్శ..

భాగస్వామివల్ల చిన్నపొరపాటు జరగ్గానే విమర్శలకు దిగకూడదు. అది ఎప్పుడైనా ఎవరికైనా సహజమని గ్రహించాలి. దాంతో అవతలి వారి మనసుకు బాధ కలగనివ్వని భాగస్వామి అవుతారు. ఎదుటివారి వల్ల ఏదైనా సంతోషం కలిగించేది జరిగినప్పుడు ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పడం మరవకూడదు. తమకేదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి తోడున్నారనే భరోసా వారికి కలిగేలా సాయపడితే మంచి తోడుగా మారినట్లే. అలాగే సంతోషాన్ని కలిసి సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఎప్పుడూ... ముందుండాలి. మొత్తానికి దంపతుల్లో ఒకరికొకరు బెటర్‌ హాఫ్‌గా అనిపించాలి. అప్పుడు ఆ దాంపత్యం ఇతరులకూ ఆదర్శమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని