స్వీయ అనుభవమిది...

వివాహం, పిల్లల పెంపకం వంటి వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ వ్యాపారం చేసే మహిళలపై అనుమానాలెక్కువ. చాలామందికి వాళ్లు వ్యాపార బాధ్యతలకు కట్టుబడి ఉండరనే సందేహం. ఈ అనుమానమే

Published : 18 Sep 2022 00:39 IST

ఫల్గుణీ నాయర్‌ వ్యవస్థాపకురాలు, నైకా

వివాహం, పిల్లల పెంపకం వంటి వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ వ్యాపారం చేసే మహిళలపై అనుమానాలెక్కువ. చాలామందికి వాళ్లు వ్యాపార బాధ్యతలకు కట్టుబడి ఉండరనే సందేహం. ఈ అనుమానమే చాలాసార్లు మహిళలకు పెట్టుబడి అందకుండా చేస్తోంది. నా విషయంలోనూ ఇది జరిగింది. మహిళల జీవితం లేదా కెరియర్‌లో కొన్నిసార్లు వ్యక్తిగతంగా బాధ్యతవహించాల్సిన అవసరం, సమయం వస్తుంది. అప్పుడు వారికి చేయూతనిచ్చేవారుంటే, బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహించగలుగుతారు. మనమూ ఏదైనా ప్రారంభించినప్పుడు సాధించగలమా లేదా అనుకోవద్దు. సవాలుగా తీసుకోవాలి. అదే విజయానికి తొలిమెట్టు. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యమే అత్యంత విలువైన పెట్టుబడి. పెద్దగా ఆలోచించండి. కానీ చిన్నగా అయినా ప్రయత్నించండి. మనకోసం మనం ధైర్యంగా కలలు కని, జీవించగలగాలి. నేను చేసేదదే. నాలాగే మహిళలందరూ ఉండాలని, తాము కన్న కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయాలని కోరుకుంటున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని