పుస్తకాలతో దోస్తీ కుదరాలంటే!

పుస్తకానికి మించిన నేస్తం వేరొకరు ఉండరేమో. కానీ పుస్తకంతో దోస్తీ అంత సులభం కాదు. అలాగని కష్టమూ కాదు. అయితే వీలైనంత చిన్న వయసులోనే పిల్లలకు పుస్తకాల్ని పరిచయం చేస్తే అవి

Published : 21 Sep 2022 00:21 IST

పుస్తకానికి మించిన నేస్తం వేరొకరు ఉండరేమో. కానీ పుస్తకంతో దోస్తీ అంత సులభం కాదు. అలాగని కష్టమూ కాదు. అయితే వీలైనంత చిన్న వయసులోనే పిల్లలకు పుస్తకాల్ని పరిచయం చేస్తే అవి వారి జీవితంలో భాగమై పోతాయంటున్నారు నిపుణులు. అందుకోసం వాళ్ల సూచనలేంటంటే..

* అప్పుడప్పుడే పదాలు పలుకుతున్న ఆరేడు నెలల పిల్లల నుంచి మాట్లాడగలిగే రెండేళ్ల పిల్లల వరకు ఎవరికైనా పుస్తకాల్ని పరిచయం చేయొచ్చు. వయసునుబట్టి చిన్నారుల్ని వీలైనంత తక్కువ సమయం పుస్తకాల ముందు కూర్చోబెట్టాలి. ఎందుకంటే వీళ్లు ఎక్కువ సమయం దేనిమీదా ధ్యాస పెట్టలేరు. పుస్తకాల విషయంలోనూ అంతే. పూటకు 5-10 నిమిషాలు కేటాయిస్తే చాలా ఎక్కువ.

* పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించేటప్పుడు వాళ్లని ఒళ్లో కూర్చోబెట్టుకోండి. లేదంటే దగ్గరగా తీసుకోండి. ఆ సమయం వారికెంతో హాయిగా అనిపిస్తే చాలు.. చెప్పింది శ్రద్ధగా వింటారు. 

* పిల్లలను నిద్ర పుచ్చే ముందు కథలు చెప్పటం అందరికీ అలవాటు. అదే సమయానికి పుస్తకంలో కథ చూపడమూ అలవాటు చేయండి. బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజన సమయం.. ఇలా రోజూ ఒక సమయానికి పుస్తకంలో కథలు చెప్పడం అలవాటు చేయడం మంచిది. దీనివల్ల వాళ్లూ ఆ సమయం వచ్చేసరికి మానసికంగా సిద్ధమైపోతారు.

* పిల్లలకు చదివి వినిపించడంకంటే కూడా బొమ్మలు చూపిస్తూ కథ చెప్పడం చాలా ముఖ్యం. మీరు చదువుకుంటూ పోతుంటే వారి ధ్యాస ఇంకో అంశం మీదకి మళ్లుతుంది. అదే బొమ్మల్ని చూపిస్తూ వివరిస్తే శ్రద్ధగా వింటారు.
ఇలా కొన్నాళ్లు అలవాటు చేస్తే చాలు. స్కూల్‌కి వెళ్లాక వాళ్లు పుస్తకాల పురుగులైపోతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్