అంతర్జాలం మితి మీరొద్దు

పాఠాల కోసం పిల్లలు ఆన్‌లైన్‌ రీడింగ్‌ ప్రారంభించడం మంచిదే. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను వాళ్లు తెలుసుకోవడమూ అత్యవసరం. దాంతోపాటు ప్రమాదాలనూ కొని తెచ్చుకునే ప్రమాదమూ ఉండొచ్చు. అందుకే స్వీయ నియంత్రణ ఉండాలి. అయితే యుక్త వయసులో తెలియని ప్రతి విషయం పట్ల పిల్లలు ఆకర్షితులవుతారు. ఇది వారిని చెడు మార్గంలోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది.

Published : 24 Sep 2022 00:32 IST

నెట్‌ను అవసరానికి మించి వినియోగించకుండా పిల్లలను ఆదిలోనే నియంత్రించాలంటున్నారు నిపుణులు.

పాఠాల కోసం పిల్లలు ఆన్‌లైన్‌ రీడింగ్‌ ప్రారంభించడం మంచిదే. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను వాళ్లు తెలుసుకోవడమూ అత్యవసరం. దాంతోపాటు ప్రమాదాలనూ కొని తెచ్చుకునే ప్రమాదమూ ఉండొచ్చు. అందుకే స్వీయ నియంత్రణ ఉండాలి. అయితే యుక్త వయసులో తెలియని ప్రతి విషయం పట్ల పిల్లలు ఆకర్షితులవుతారు. ఇది వారిని చెడు మార్గంలోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. వీటి నుంచి పిల్లలను తప్పించి సక్రమ మార్గంలో నడిపించాలంటే పెద్దలే మార్గదర్శకులుగా వ్యవహరించాలి. ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు అందులోని ఇబ్బందులు, నష్టాలు, ప్రమాదాలపైనా అవగాహన కల్పించాలి.

పరిమితం..

కొన్ని ప్రాజెక్ట్‌లకు నెట్‌ అవసరం. తెలియని పాఠాల వివరాలూ తెలుసు కోవచ్చు. అలా చదువు కోసం ప్రారంభించి ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడతారు. అనవసరమైన అంశాల్లోనూ ప్రవేశిస్తారు. అందుకే ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని పరిమితం చేయడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. నెట్‌లో సమస్యలబారిన పడిన వారి వార్తలను వినిపించడం, అలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివి పిల్లలకు ఎప్పటికప్పుడు అర్థమయ్యేలా చెప్పాలి. అవన్నీ వారిని ఆలోచించేలా చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్