చిన్నారుల దుస్తులు కొనేముందు..!
దుస్తుల నుంచి ఆడుకునే బొమ్మల వరకూ పిల్లలకు సంబంధించిన ప్రతిదానిలోనూ రసాయనాల జాడ కనిపిస్తోంది. ఈతరం అమ్మల్ని ఇది కంగారు పెట్టే విషయమే! అందుకే సేంద్రియ దుస్తులవైపు మళ్లుతున్నారు.
దుస్తుల నుంచి ఆడుకునే బొమ్మల వరకూ పిల్లలకు సంబంధించిన ప్రతిదానిలోనూ రసాయనాల జాడ కనిపిస్తోంది. ఈతరం అమ్మల్ని ఇది కంగారు పెట్టే విషయమే! అందుకే సేంద్రియ దుస్తులవైపు మళ్లుతున్నారు. మరవి నిజంగానే రసాయనాల్లేనివేనా?
* చాలా వస్త్ర సంస్థల ప్యాకేజింగ్‌లపై ‘గ్రీన్’, ‘సస్టెయినబిలిటీ’, ‘ఎకోఫ్రెండ్లీ’ లోగోలు కనిపిస్తుంటాయి. వాళ్లు చెప్పినంత మాత్రాన నమ్మేసి కొనేయకండి. సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లోతుగా పరిశోధించండి. రుజువు చేసే సర్టిఫికేషన్లు ఏమైనా ఉన్నాయేమో చూశాకే నిర్ణయం తీసుకోండి. దుస్తులు హాని కలిగించనివి అయితే సరిపోదు. వాటిపై వేసిన డై, రంగులు వంటివీ హాని కలిగించకూడదు. వాటి గురించీ తెలుసుకోండి.
* చూడటానికి బాగున్నాయనీ కొనేయొద్దు. సంస్థ నమ్మకమైనదా కాదా చెక్ చేసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో వాటి గురించి వెతికినా సరిపోతుంది. ప్రొడక్ట్ కొనేముందు దానిపై రివ్యూలను ఓసారి చూసుకోండి. బంధువులు, స్నేహితుల అభిప్రాయాలను తెలుసుకుంటే వారి అనుభవం ఉపయోగపడుతుంది.
* చిన్నపిల్లలవి చూడటానికి బాగుంటే సరిపోదు. సౌకర్యంగానూ ఉండాలి. అందుకే ఎక్కువమంది ఎంపిక కాటన్ అవుతుంది. అయితే సేంద్రియ దుస్తులకొచ్చేసరికి అవి ఉత్పత్తి తక్కువ. దీంతో సహజంగానే ఖరీదు ఉంటాయి. సర్టిఫికేషన్ ఖర్చులు అదనం. తక్కువ ఖర్చు అనగానే నమ్మేయకండి. చాలావరకూ ఇలాంటి సంస్థలు వస్త్రతయారీ నుంచి దుస్తులు రూపొందే విధానం వరకూ ప్రతి దశ గురించీ వెబ్‌సైట్‌లో ఉంచుతాయి. వాటిని పరిశీలించి కొనడం ఉత్తమం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.