వినోదంతో పాటు విజ్ఞానం..

కళ్లు తెరవకముందే తన ఆకలిని ఏడుపుతో తెలియజేసి చేతులతో తడిమి తల్లి స్తన్యాన్ని నోటికి చిక్కించుకుంటుంది బిడ్డ. అది మొదలు అనుక్షణం నేర్చుకుంటూనే ఉంటుంది. ఇంట్లో, బడిలో పాఠాల సంగతలా ఉంచితే ఆటల ద్వారానూ బోల్డన్ని తెలివితేటలొస్తాయి.

Published : 11 Oct 2022 00:28 IST

కళ్లు తెరవకముందే తన ఆకలిని ఏడుపుతో తెలియజేసి చేతులతో తడిమి తల్లి స్తన్యాన్ని నోటికి చిక్కించుకుంటుంది బిడ్డ. అది మొదలు అనుక్షణం నేర్చుకుంటూనే ఉంటుంది. ఇంట్లో, బడిలో పాఠాల సంగతలా ఉంచితే ఆటల ద్వారానూ బోల్డన్ని తెలివితేటలొస్తాయి. అందుకే అనేక సంస్థలు నెలల చిన్నారి నుంచి పన్నెండేళ్ల బాలల వరకూ ఎడ్యుకేషనల్‌ టాయ్స్‌ రూపొందిస్తున్నాయి. అలాంటివి కొనిస్తే పిల్లలకు కావల్సినంత కాలక్షేపం, విజ్ఞానం. అదనంగా అల్లరీ, ఆగడాలూ తగ్గుతాయి.


* బిల్డింగ్‌ బ్లాక్స్‌, కన్‌స్ట్రక్షన్‌ టాయ్స్‌, ఎరెక్టర్‌ సెట్‌ లాంటివి ఆనందాన్నివ్వడమే గాక తెలివిని పెంచుతాయి. పెద్ద పెద్ద ఇళ్లు కట్టేసి బుల్లి ఇంజినీర్లయిపోతారు. వాళ్లు కళ్లెగరేసి నవ్వుతుంటే అది చూసి మనమూ పరవశిస్తాం. ఇవి వినోదాన్ని పంచుతూనే విజ్ఞానాన్ని పెంచుతాయి.

* నెలల పిల్లలకు మాట్లాడుతూ, పాటలు పాడుతూ డ్యాన్స్‌ చేసే కాక్టస్‌ టాయ్స్‌ లాంటివి అందిస్తే కళ్లప్పగించి కేరింతలు కొడతారు. యాక్టివిటీ ప్లే జిమ్‌ ముందు కూర్చోబెడితే చిన్నారి మెదడు చురుగ్గా ఉండటమే కాదు, వ్యాయామం కూడా చేసినట్టవుతుంది. ఇలాంటివాటితో పిల్లలు ఏడుపనే పదాన్నే మర్చిపోతారు.

* పిల్లలకు ‘ఓపెన్‌ అండ్‌ ఫిక్స్‌’ కార్లూ, ట్రక్కులూ ఇచ్చే థ్రిల్‌ అంతా ఇంతా కాదు. వాటిని విప్పుతూ, బిగిస్తూ వీరానందం పొందే బుడతకీచులు భవిష్యత్తులో ఉద్ధండులై ప్రశంసలు పొందడం ఖాయం.

* కోడి, కోతి, ఇల్లు, తోట, దేశపటం లాంటి జిగ్సా పజిల్స్‌ ఏ వయసు పిల్లలనైనా ఆకట్టుకుంటాయి. వాటిని ఎంత త్వరగా పేర్చితే అంత చురుకుదనం ఉన్నట్టు కనుక తోటి పిల్లలతో పోటీ పెట్టుకుంటారు. పట్టుదలతో వేగం సాధించి చప్పట్లు కొట్టించుకుంటారు.

* ‘మ్యాగ్నెటిక్‌ ఫన్‌ విత్‌ ఆల్ఫాబెట్‌ అండ్‌ వర్డ్‌’ ఆటలో కుక్క, పిల్లి లాంటి బొమ్మను ఎంచుకుని ఆ పదంలో ఉండే అక్షరాలను వెతికి బోర్డు మీద అతికిస్తారు. వీటితో స్పెల్లింగులు నేర్చుకోవడంతోబాటు వేగం అలవాటవుతుంది.

* ‘స్పీక్‌ అండ్‌ స్పెల్‌’, ‘స్పీక్‌ అండ్‌ రీడ్‌’ లాంటి ఆట వస్తువులతో సరదా సరదాగా పాఠాలు నేర్చేసుకుంటారు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్